Cyberpower IISS : సైబర్ పవర్‌‌లో ఇండియా థర్డ్ ప్లేస్, టాప్‌‌లో అమెరికా

భవిష్యత్ లో సైబర్ యుద్ధాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు అర్థం. అయితే..సైబర్ సెక్యూర్టీ పరంగా ఏ దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని లండన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) ఓ అధ్యయనం చేసింది.

Cyberpower IISS : సైబర్ పవర్‌‌లో ఇండియా థర్డ్ ప్లేస్, టాప్‌‌లో అమెరికా

Cyber Power

India Cyberpower : సైబర్ ఇప్పుడు అన్ని దేశాలకు కీలకం. ఇందులో ఎంత శక్తివంతంగా ఉంటుందో అప్పుడే ఆ దేశ ప్రజలకు భద్రత ఉంటుంది. అయితే..కొన్ని దేశాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు వీరి బారిన పడుతూ..నష్టపోతున్నారు. భవిష్యత్ లో సైబర్ యుద్ధాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు అర్థం. అయితే..సైబర్ సెక్యూర్టీ పరంగా ఏ దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని లండన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) ఓ అధ్యయనం చేసింది.

ఈ స్టడీలో వాటి సామర్థ్యాలకు అనుగుణంగా..దేశాలకు ర్యాంకులు కేటాయించింది. డిజిటిల్ ఆర్థిక వ్యవస్థ, శక్తి సామర్థ్యాలు, ఇంటెలిజెన్స్ పరిపక్వత, భద్రతా విధులు సైనిక సైబర్ శక్తి సామర్థ్యాల ఆధారంగా ఐఐఎస్ఎస్ దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. సైబర్ శక్తి పరంగా..భారత దేశం థర్డ్ టైర్ లో ఉండడం గమనార్హం. ఇండియాతో పాటు..ఇండోనేషియా, మలేషియా, జపాన్, ఉత్తర కొరియా, ఇరాన్ వియత్నాం వంటి దేశాలు ఈ టైర్ లో ఉన్నాయి. టాప్ టైర్ లో కేవలం ఒకేఒక దేశం అమెరికా ఉంది.
ఆన్ లైన్ గూఢచర్యం చాలా శక్తివంతంగా మారుతోందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, జపాన్ వంటి శక్తివంతమైన దేశాలు థర్డ్ టైర్ లో ఉండడం ఆశ్చర్యమేసిందని ఐఐఎస్ఎస్ లో సైబర్ స్పేస్ నిపుణుడు గ్రెగ్ ఆస్టిన్ వెల్లడించారు. ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా వంటి చిన్న దేశాలు అత్యాధునిక సైబర్ నైపుణ్యాలను కలిగి ఉండడం విశేషం. చైనా సైబర్ శక్తి సామర్ధ్యాలు అనుకున్నంత రీతిలో లేవని పేర్కొంది