AmitShah on Economy: భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది: కేంద్ర మంత్రి అమిత్ షా

భారత్ కొన్నేళ్లలోనే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014కు ముందు భారత్ ప్రపంచంలో 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు బ్రిటన్ ను వెనక్కు నెట్టి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. కొన్నేళ్లలో మూడో స్థానానికి చేరతామన్న పూర్తి నమ్మకం తనకు ఉందని అన్నారు.

AmitShah on Economy: భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది: కేంద్ర మంత్రి అమిత్ షా

AmitShah on Economy

AmitShah on Economy: భారత్ కొన్నేళ్లలోనే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014కు ముందు భారత్ ప్రపంచంలో 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు బ్రిటన్ ను వెనక్కు నెట్టి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. కొన్నేళ్లలో మూడో స్థానానికి చేరతామన్న పూర్తి నమ్మకం తనకు ఉందని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో సహకార రంగం కీలకపాత్ర పోషిస్తుందని అమిత్ షా చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికలలోపు దేశంలో కేంద్ర ప్రభుత్వం 2 లక్షల డెయిరీ కో-ఆపరేటివ్ ల ఏర్పాటుకు సాయం చేస్తుందని చెప్పారు. డెయిరీ పరిశ్రమలో అధునాతన సాంకేతికత, కంప్యూటరైజేషన్, డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు వంటివి ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

దేశంలో ఉన్న డిమాండుకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని రాబట్టాలని ఆయన చెప్పారు. అలాగే, పేద దేశాలను ఎగుమతి చేసేలా ఉత్పత్తి ఉండాలని సూచించారు. దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సహకార రంగం సహకారం అందిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార రంగం, డెయిరీ కో-ఆపరేటివ్ లు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు