Mixing of Vaccines: వేర్వేరు వ్యాక్సిన్లు మిక్సింగ్‌పై స్టడీ చేస్తోన్న ఇండియా

ఇద్దరు డిఫరెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్ల వ్యాక్సిన్ మిక్సింగ్ పై పరీక్ష చేస్తున్నామన్నారు. అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా అనే విషయంపై నిర్థారణ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Mixing of Vaccines: వేర్వేరు వ్యాక్సిన్లు మిక్సింగ్‌పై స్టడీ చేస్తోన్న ఇండియా

Vaccine Mixing

Mixing of Vaccines: మరి కొద్ది వారాల్లో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఇండియా స్టడీ నిర్వహించబోతుందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ సెంటర్ చీఫ్ సోమవారం వెల్లడించారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఛైర్మన్ డా.ఎన్కే అరోరా మాట్లాడుతూ.. ఇద్దరు డిఫరెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్ల వ్యాక్సిన్ మిక్సింగ్ పై పరీక్ష చేస్తున్నామన్నారు. అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా అనే విషయంపై నిర్థారణ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మరికొద్ది రోజుల్లో ఇండియాలో డిఫరెంట్ డోసుల టెస్టింగ్ ఎంతవరకూ సాధ్యపడుతుందో అనేదానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇండియాలో ఆగష్టు నాటికి మన వ్యాక్సిన్ల ఉత్పత్తి సరిపోదని.. విదేశీ యూనిట్ల నుంచి తెచ్చుకోవాల్సిందేనని అన్నారు. విషయం ఏమిటంటే.. రోజుకు కోటి వ్యాక్సిన్లు వేయగలిగితేనే ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.

థియరిటికల్ గా ఇది సాధ్యపడుతుందని నీతి అయోగ్ హెల్త్ మెంబర్, ఇండియా కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ అన్నారు. రెండు విభిన్న మ్యాన్యుఫ్యాక్చర్ల నుంచి వ్యాక్సిన్ డోసులు మిక్స్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందనే విషయం తెలుసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం ఇండియా కొవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను మాత్రమే తయారుచేస్తుంది. కొవిడ్-19 ఇమ్యూనైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఈ రెండింటిని మాత్రమే ఇస్తున్నారు. రష్యన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మాత్రం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఎమర్జెన్సీ యూజ్ కోసం అప్రూవల్ పొందిన మూడో వ్యాక్సిన్.