Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్

రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిళ్లకు భారత్ తొలొగ్గదని.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్

Russia1

Crude oil from Russia: రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలును భారత్ కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంత మేర డిస్కౌంట్ కి లభిస్తుందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం రష్యా నుంచి బ్యారెల్ ముడి చమురును సగటు ధర $ 100 చొప్పున భారత్ కొనుగోలు చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్ కు కలిసొచ్చింది. ఈక్రమంలో రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిళ్లకు భారత్ తొలొగ్గదని.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

other stories:Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా

అయితే రష్యాపై అమెరికా ఆర్ధిక ఆంక్షల దృష్ట్యా ముడి చమురు కొనుగోలుకు సంబంధించి చెల్లింపు విధానాన్ని భారత్ పరిశీలిస్తోందని ఈ విషయంలో అవగాహన ఉన్న ఒక ఉన్నతాధికారి తెలిపారు. రూపాయి-రూబుల్ చెల్లింపు విధానాన్ని కూడా ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కొన్ని ఐరోపా దేశాలు కూడా రూబుల్‌లోనే చెల్లిస్తున్నాయి. భారతదేశం తన చమురు అవసరాలలో 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈక్రమంలో రష్యా నుంచి చవకగా ముడి చమురు లభించడంతో దేశ అవసరాల దృష్ట్యా భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

other stories: Modi in Hyderabad: ప్ర‌ధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు

ఈ ఏడాది మార్చిలో ముడి చమురు దిగుమతులు ప్రారంభం అవగా..మార్చి నెలలో రోజుకు 66 వేల బ్యారెల్స్ భారత్ దిగుమతి చేసుకోగా..ఏప్రిల్ లో ఆ సంఖ్య రోజుకు 2 లక్షల 77 వేల బ్యారెళ్లకు చేరింది. దీంతో భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రష్యా నాల్గవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. గత సంవత్సరం, రష్యా మినహా..ఎనిమిది దేశాల నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏప్రిల్ నాటికి, ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇంధనం వినియోగంలో అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. భారత్‌కు రోజుకు 4,87,500 బ్యారెళ్ల చమురును విక్రయించేందుకు రష్యా సిద్ధంగా ఉంది.