Miss World 2023 : 27 ఏళ్ల తరువాత భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు ..

మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరుగనున్నాయి. దీని కోసం 130 దేశాల జాతీయ ఛాంపియన్లు భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారు.

Miss World 2023 : 27 ఏళ్ల తరువాత  భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు ..

India to host 2023 Miss World

India to host 2023 Miss World : 27 ఏళ్ల తరువాత అంటే దాదాపు 3 దశాబ్దాల తరువాత భారత్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లో వచ్చే నవంబర్ లో జరగనున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో జూలియా మోర్లీ ప్రకటించారు. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత్ లో ఈ వేడుక నిర్వహించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని జూలియా మోర్లీ తెలిపారు. చివరి సారి ఇండియాలో 1996లో అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు జరిగాయి. ఆ తరువాత ఇదే భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది.

 

ఈ పోటీలకు సంబంధించి తుది తేదీలు ఇంకా ఖరారు కాపోయినప్పటికి వచ్చే నంబంర్ లో జరుగుతాయని తెలుస్తోంది. ఈ పోటీలు భారత్ లో జరుగనున్న క్రమంలో 130 దేశాల జాతీయ ఛాంపియన్లు భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. తమ అందంతో పాటు ప్రతిభను చాటేందుకు ప్రపంచ వ్యాప్తంగా సుందరీమణులు ఎదురు చూస్తుంటారు ఈ పోటీల కోసం. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై ప్రపంచ వ్యాప్తంతో ఎంతోమంది దృష్టి పెడుతుంటారు. ఈ పోటీలను నిర్వహించే అవకాశం అన్ని దేశాలకు రాదు. కానీ 2023 మాత్రం భారత్ కు అటువంటి అవకాశం వచ్చింది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలను నిర్వహించే అవకాశం భారత్ కు వచ్చింది.

 

ఈ పోటీల ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) మాట్లాడుతూ.. గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఈ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మిస్‌ ఇండియా వరల్డ్‌ సినీ శెట్టి కూడా తన భావాలను పంచుకున్నారు.

 

ఆరుసార్లు టైటిల్‌ గెలిచిన భారత్‌..ఆ సుందరీమణులు వీరే..

రీటా ఫరియా – 1966
ఐశ్వర్యా రాయ్ – 1994
డయానా హేడెన్ – 1997
యుక్తా ముఖి – 1999
ప్రియాంకా చోప్రా – 2000
మానుషి చిల్లార్ – 2017