International Flights : డిసెంబర్-15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం

కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి నలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుండి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు శుక్రవారం పౌర విమానయాన

International Flights : డిసెంబర్-15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం

Flights2

International Flights కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి  పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని  శుక్రవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రహోంశాఖ,ఆరోగ్యశాఖ,విదేశాంగశాఖతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘ప్రమాదం’గా గుర్తించబడిన 14 దేశాలు మరియు ఇందులో ఇప్పటికే ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం ఉన్న దేశాలకు 75 శాతం ప్రీ-కోవిడ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా,గత వారం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా..అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి(కోవిడ్ పూర్వ స్థితికి) తీసుకొచ్చే ప్రక్రియపై కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఇక,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు,కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆంక్షలను ఎదుర్కొన్న దేశీయ విమాన సేవలు..గత నెల నుంచి పూర్తిస్థాయిలో అనుమతించబడిన విషయం తెలిసిందే.

ALSO READ Travel Ban From South Africa : దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై యూరప్ దేశాలు నిషేధం