Afghanistan: అఫ్ఘనిస్తాన్‌కు భారత్ భారీ సాయం.. 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా

తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌కు భారత్ భారీ సాయం.. 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా

Afghanistan: కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అఫ్ఘనిస్తాన్‌కు భారత్ భారీ సాయం అందించనుంది. తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. 9న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ఐక్యరాజ్యసమితి ఆహార భద్రతలో భాగంగా భారత్ ఇతర దేశాలకు ఇలా ఆహార సరఫరా చేస్తోంది. అఫ్ఘనిస్తాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గత ఏడాది కూడా అఫ్ఘనిస్తాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేసింది. ఈసారి 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సాయంగా అందించనుంది. అయితే, గతంలో పాకిస్తాన్ నుంచి గోధుమలు రవాణా చేసేది. ఇటీవల పాకిస్తాన్‌తో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో భారత్ ఈసారి ఇరాన్ నుంచి గోధుమలు రవాణా చేయబోతుంది. ఇరాన్‌లోని చాబహర్ పోర్ట్ గుండా గోధుమల్ని అఫ్ఘనిస్తాన్‌కు అందజేస్తుంది.

International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే

2021లో అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇండియా తాలిబన్ల పాలనను అంగీకరించనప్పటికీ, ఆ దేశానికి సాయం అందిస్తోంది. తాలిబన్ల పాలన మొదలయ్యాక అనేక దేశాలు అక్కడి రాయబార కార్యాలయాల్ని మూసేశాయి. రాయబారుల్ని వెనక్కు రప్పించాయి. ఇండియా కూడా అదే దారిలో నడిచింది. అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసేసింది. అయితే, గత ఏడాది జూన్‌లో అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని రాయబార కార్యాలయంలో ఒక సాంకేతిక బృందాన్ని భారత్ ఏర్పాటు చేసింది.