India-US Relations : భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం

భారత్‌ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధాని మోదీ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.

India-US Relations : భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం

Modi, Baiden

India-US relations strengthened : భారత్‌ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధాని మోదీ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. పరస్పర విశ్వాసంతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ సూచిస్తే… భారత్‌ను ప్రధాన మిత్రదేశంగా భావిస్తున్నామని బైడెన్‌ పేర్కొన్నారు. ఉపాద్యక్షుడిగా ఉన్నప్పుడే పరిణితి చూపించిన బైడెన్‌… అధ్యక్షుడయ్యాక ఇరుదేశాల సంబంధాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు మోదీ.

పరస్పర విశ్వాసం ముఖ్యమని మహాత్మాగాంధీ ఎప్పుడూ చెప్పేవారని ఇప్పుడు కూడా ఇరుదేశాలు అదే సూత్రంతో ముందుకెళ్లాలని మోడీ తెలిపారు. ఇటు భారత్‌, అమెరికా సంబంధాల మెరుగుదలకు బైడెన్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. మోదీ గురించి తనకు చాలాకాలంగా తెలుసని… ఆయన్ను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు బైడెన్… వాణిజ్యరంగంలో పరస్పర సహకారం ఇరుదేశాలకు లాభదాయకమన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందన్నారు అమెరికన్ అధ్యక్షుడు. ఇరువురు నేతల మధ్య దాదాపు 50నిముషాల పాటు చర్చలు జరిగాయి.

PM Modi : దేశాల కలయిక ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం : ప్రధాని మోడీ

అంతకుముందు అధ్యక్షుడి కార్యాలయం ఒవెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అధ్యక్ష కార్యాలయంలోని విజిటర్స్‌బుక్‌లో మోదీ సంతకం చేశారు. ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆహ్వానించారు బైడెన్‌… ఇద్దరు నేతలు ఆత్మీయంగా చేతులు కలిపారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అప్ఘాన్‌ పరిణామాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.

ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో పాటు వాతావరణ మార్పులు కూడా చర్చకు వచ్చాయి. మూడు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని బిజీబిజీగా గడుపుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఆస్ట్రేలియా, జపాన్ ప్రతినిధులతోనూ మోదీ సమావేశమయ్యారు. ప్రముఖ సంస్థల సీఈఓలతోనూ ఆయన చర్చలు జరిపారు.