Chhattisgarh : శరణు అంటే ప్రాణభిక్ష లేదంటే మరణశిక్ష అంటున్న కేంద్రం..2024నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ మారుస్తామన్న అమిత్ షా

2024 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో చెప్పారు.  మావోయిస్టులను అంతమొందించే యత్నంలో కేంద్రం ఏకంగా హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతోంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో.. అడవుల్లో అప్పుడప్పుడు అలజడి రేగుతూనే ఉంది. తాజాగా.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసేందుకు.. ఏకంగా హెలికాప్టర్లు వాడారన్న న్యూస్.. ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.

Chhattisgarh : శరణు అంటే ప్రాణభిక్ష లేదంటే మరణశిక్ష అంటున్న కేంద్రం..2024నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ మారుస్తామన్న అమిత్ షా

India will be free from Maoist menace by 2024

Chhattisgarh : 2024 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో చెప్పారు.  మావోయిస్టులను అంతమొందించే యత్నంలో కేంద్రం ఏకంగా హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతోంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో.. అడవుల్లో అప్పుడప్పుడు అలజడి రేగుతూనే ఉంది. తాజాగా.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసేందుకు.. ఏకంగా హెలికాప్టర్లు వాడారన్న న్యూస్.. ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక సమయం లేదు శరణు అంటూ లొంగిపోతారో.. రణానికే మొగ్గు చూపుతారో మరణం తప్పదంటూ మావోయిస్టులకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తోంది కేంద్రం. 2024 ఎన్నికల నాటికే ఈ టార్గెట్‌ పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయం చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందే.. భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామంటున్నారు. కొద్దిరోజుల కిందటే.. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటించిన సందర్భంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో.. ఈ కీలక కామెంట్స్ చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు.. వారి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అమిత్‌ షా కామెంట్స్‌ చేసిన కొన్ని రోజులకే సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ జరగడం.. కేంద్రం నక్సలిజాన్ని తుదముట్టించానికి చేసే యత్నం అని చెప్పాలి.

ఈక్రమంలో కేంద్రం ఫోకస్ అంతా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మీదే ఉంది. ఎందుకంటే.. మావోయిస్ట్ కీలక నేతలంతా ఉండేది అక్కడే. అందువల్ల.. వాళ్లను ఎన్‌కౌంటర్ చేస్తే.. పార్టీ కేడర్ అంతా కంట్రోల్ అవుతుందనే ఆలోచనతో ఉంది కేంద్రం. తాజాగా ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిపిన ఎన్‌కౌంటర్ లక్ష్యం కూడా ఇదే. ఈ దాడిలో.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను టార్గెట్‌ చేసి పోలీసు బలగాలు దాడి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా టీం జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో.. హిడ్మా ఎన్‌కౌంటర్ అయినట్లు వార్తలొచ్చాయ్. కానీ.. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదగు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ – బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో.. ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పోలీసులు హెలికాప్టర్ కూడా వాడారని స్థానికులు చెబుతున్నారు. హిడ్మా సేఫ్‌గా ఉన్నాడంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పోలీసులు మాత్రం ఈ దాడికి హెలికాప్టర్లు, డ్రోన్లు వాడారంటూ ఆరోపిస్తోంది. దీంతో.. నిజంగానే హిడ్మా ఎస్కేప్‌ అయ్యాడా అన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది.

50 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను.. నాలుగు రాష్ట్రాల పోలీసులు.. 20 ఏళ్లుగా వెతుకుతున్నారు. ఇప్పుడున్న మావోయిస్ట్ అగ్ర నేతల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నది కూడా అతడే. భద్రతా బలగాలను దెబ్బతీయడంలో హిడ్మాది అందెవేసిన చేయి. అతడు స్కెచ్ వేసి చేసిన దాడుల్లోనే ఎక్కువమంది పోలీసులు ప్రాణాలు వదిలారు. అందుకే.. అతడి పైనే ముందుగా గురి పెట్టాయి భద్రతా బలగాలు.

ఇంతకముందు.. మావోయిస్టులపై దాడులు చేయాలంటే.. గ్రౌండ్ ఫోర్స్ మాత్రమే వెళ్లేది. తుపాకులు పట్టుకొని.. బుల్లెట్ బ్యాగులు భుజాలకు వేసుకొని.. అడవుల్లో కూంబింగ్ చేస్తూ.. కిలోమీటర్లకు కిలోమీటర్లు దండకారణ్యంలోకి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఎక్కడైనా మావోయిస్టులు కనిపిస్తే.. పరస్పరం కాల్పులు జరిగేవి. అప్పుడు.. మావోయిస్టుల వైపు గానీ, పోలీసుల వైపు గానీ.. ప్రాణనష్టం జరిగేది. ఇంకొన్ని సందర్భాల్లో.. ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు పక్కాగా దాడులు చేసేవారు. అలా.. ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులను హతమార్చేవారు. కానీ.. ఇప్పుడు కేంద్రం డైరెక్షన్‌లో జరుగుతున్న దాడుల స్టైల్ పూర్తి భిన్నంగా ఉంది. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయాలని నిర్ణయించుకుంటే.. అప్పటిలా గన్నులు చేతబట్టి.. కూంబింగ్ చేసుకుంటూ.. అడవుల్లోకి వెళ్లడం లేదు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని పోలీసులు గట్టిగా వాడేస్తున్నారు. డ్రోన్ల సాయంతో రెక్కీ చేసి.. మావోయిస్టులు ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టి మరీ దాడులు చేస్తున్నారు.

తాజాగా ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో.. ఏకంగా హెలికాప్టర్లనే రంగంలోకి దించారు పోలీసులు. డ్రోన్ల సాయంతో హిడ్మా లాంటి కీలక నేతలు ఎక్కడున్నారు? అతని చుట్టుపక్కల ఎంత మంది రక్షణగా ఉంటారు. అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలంటే.. ఎలాంటి ప్లాన్ అమలు చేయలాన్న దానిపై.. పక్కాగా సమాచారం తెలుసుకుంటున్నారు. ఆ తర్వాతే దాడులకు దిగుతున్నారు. ఇందుకు.. లేటెస్ట్ ఎన్‌కౌంటరే ఎగ్జాంపుల్. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఛత్తీస్‌ఘడ్ మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా.. ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావోయిస్ట్ పార్టీలో ఉన్న నెంబర్ వన్ బెటాలియన్.. ఇప్పుడు హిడ్మా చేతిలో ఉంది. అతను ఆదేశిస్తే.. ఆ బెటాలియన్ ఎక్కడికైనా విరుచుకుపడుతుంది. మావోయిస్ట్ పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుక్మా టీమ్‌కు పేరుంది. ఈ దళం.. సంచలనం రేపిన ఎన్నో దాడులకు పాల్పడింది.

వందలాది మంది మిలిటెంట్లను.. గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం హిడ్మా ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే.. ఎవరూ తప్పించుకోరని మావోయిస్ట్ పార్టీలో ఓ నమ్మకం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో.. గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణమని అక్కడి పోలీసులు చెబుతారు. మనుషుల్ని చంపడంలో.. హిడ్మా హింసాకాండ ఎంతో భయంకరంగా ఉంటుందనే టాక్ ఉంది. ముఖ్యంగా.. ఇన్‌ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడ్డాడనే చర్చ కూడా ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని.. దాదాపు 10 మంది వరకు రాత్రింబవళ్లు హిడ్మాకు పహారా కాస్తారని మాజీ మావోయిస్టులు చెబుతారు. మరి.. అలాంటి కీలక నేతను ఎన్‌కౌంటర్ చేయాలంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే.. కేంద్రం హెలికాప్టర్లను రంగంలోకి దించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.