Asia Cup 2022: మహిళల ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. శ్రీలంకపై తొలి టీ20 గెలిచిన టీమిండియా

మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.

Asia Cup 2022: మహిళల ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. శ్రీలంకపై తొలి టీ20 గెలిచిన టీమిండియా

Asia Cup 2022: మహిళల ఆసియా కప్, తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 150 పరుగులు చేసింది.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

తర్వాత 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచులో భారత్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించింది. భారత బ్యాటింగ్‌కు సంబంధించి జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి, టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిజానికి నాలుగు ఓవర్లలోనే భారత ఓపెనర్లు మంధాన, షఫాలి ఔటయ్యారు. 23 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియాను జెమీమా గట్టెక్కించింది. జెమీమా-హర్మన్ కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తర్వాత హర్మన్ 33 పరుగుల వద్ద ఔటైంది. ఆ తర్వాత వచ్చిన పూజా వస్త్రాకర్ ఒక్క పరుగు చేసి ఔటవ్వగా, రిచా ఘోష్ 9 పరుగులు చేసి ఔటైంది. తర్వాత హేమలత 13 పరుగులు చేసింది.

తర్వాత 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్‌లో తడబడింది. లంక బ్యాట్స్‌ఉమెన్ విఫలమయ్యారు. ఆ జట్టులో హాసిని పెరెరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత హర్షిత మాధవి 26 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచింది. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. హేమలత మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.