India coronarius Update : కరోనా కేసుల్లో వరల్డ్ నెం 2.. భారత్.. రికవరీ రేటు సూపర్బ్‌

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 08:51 PM IST
India coronarius Update : కరోనా కేసుల్లో వరల్డ్ నెం 2.. భారత్.. రికవరీ రేటు సూపర్బ్‌

India World Number 2 in Covid Cases : అంతా ఓకే.. పరిస్థితులన్నీ మళ్లీ నార్మల్ అయిపోతున్నాయ్. కానీ.. కేసులు పెరిగిపోతున్నాయ్. కానీ.. జనాల్లో మాత్రం అప్పటి అంత భయం లేదు. ఎందుకంటే.. కరోనాపై అవగాహన వచ్చేసింది. రికవరీ రేటు కూడా సూపర్బ్‌గా ఉంది. వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాయ్. రష్యా వ్యాక్సిన్‌పై.. ఇప్పుడు ఇండియా కూడా ఆశలు పెట్టుకుంది. మరి.. ఎంతవరకొచ్చింది వ్యాక్సిన్..



ఇండియాలో.. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. రోజుకు.. 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయ్. దీంతో.. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. దీంతో.. కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 41 లక్షల 37 వేల కేసులు నమోదయ్యాయ్. 64 లక్షలకు పైగా కేసులతో.. అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో.. 32 లక్షల మంది కోలుకున్నారు. మరో.. 8 లక్షల 86 వేల యాక్టివ్ కేసులున్నాయి. మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పటివరకు 71 వేల మందికి పైగా కోవిడ్ బారిన పడి మృతి చెందారు. కోవిడ్ మరణాల్లో.. భారత్ ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగుతోంది.

77 శాతానికి రికవరీ రేటు :
ఇంతటి సంక్షోభంలోనూ.. పాజిటివ్ విషయం ఏదైనా ఉందటే.. భారత్ రికవరీ రేటు పెరగడమే. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. జనాల్లో వైరస్ అంటే భయం తగ్గడమే. ఇండియాలో కరోనా కేసులు పెరిగుతున్న క్రమంలో.. చాలా మంది భయంతోనే చనిపోయారని చాలా నివేదికలు స్పష్టం చేశాయ్. ప్రస్తుతం.. కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందడం లేదు. వైరస్ సోకితే.. మహా ఐతే.. 3 వారాల్లో తిరిగి కోలుకుంటామనే ధైర్యంతో ఉన్నారు. అందుకే.. రికవరీ రేటు బాగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు.



ఇదిలా ఉంటే.. కరోనాకు చెక్ పెట్టేందుకు జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా అన్ని దేశాల్లో చివరిదశలో ఉన్నాయి. భారత్‌లో కూడా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి.. ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నాయ్. ఐతే.. ఇప్పటికే రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆవిష్కరించిన కరోనా వ్యాక్సిన్.. స్పుత్నిక్-వి పై ఆశలు చిగురిస్తున్నాయ్.

తొలి రెండు దశల్లో 76 మందిపై జరిపిన హ్యూమన్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేశాయ్. తొలి రెండు దశల ప్రయోగాల సమగ్ర సమాచారాన్ని.. రష్యా భారత్‌కు అందించినట్లు తెలిసింది. వ్యాక్సిన్ సమర్ధతకు భారత నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇండియాలోనే మూడో దశ ప్రయోగాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐతే.. ఫైనల్ స్టేజ్ ప్రయోగాలు పూర్తి చేయకుండానే.. వ్యాక్సిన్ రెడీ అయినట్లు రష్యా ప్రకటించగానే.. అంతర్జాతీయంగా విమర్శలొచ్చాయి. తొలి రెండు దశల ప్రయోగ ఫలితాలను కూడా రష్యా బయటకి చెప్పకపోవడం.. పలు సందేహాలకు తావిచ్చింది. ఇలాంటి టైంలో.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌తో.. శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించింది. రష్యా వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారిలో.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని స్పష్టం చేసింది. దీంతో.. రష్యా వ్యాక్సిన్‌పై కొన్ని దేశాలు ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి.

దాదాపు 40 వేల మందికి టీకా :
ఇప్పటికే రష్యాలో మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్‌పై మెరుగైన ఫలితాలు వస్తుండటంతో.. మరికొన్ని రోజుల్లోనే దాదాపు 20 దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రష్యా టీకా గనక పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే.. ఇండియాకు కూడా డోస్‌లు వచ్చే అవకాశం ఉంది. రష్యా ఎలాగూ.. భారత్‌కు మిత్రదేశం కాబట్టి.. అక్కడ వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయితే.. మన దగ్గర కూడా వాటిని తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే.. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ లాస్ట్ స్టేజ్‌కు చేరుకోవడంతో.. హోప్స్ డబుల్ అయ్యాయి. ఐతే.. ప్రతి దేశపు అవసరాల్ని తీర్చే స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఎలా తయారు చేస్తారు.. ఎలా పంపిణీ చేస్తారు.. ఎవరికి ముందు ఇస్తారన్న అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. యూనిసెఫ్ వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ ప్రక్రియల్ని స్వయంగా నిర్వహించనుంది.

ఇప్పటికే.. అనేక వ్యాధులకు సంబంధించి ఏటా 2 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను.. ఈ సంస్థ కొనుగోలు చేస్తోంది. వీటిని.. దాదాపు వంద దేశాల్లో.. పిల్లలకు అందజేస్తోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో పరస్పర సహకారానికి కొవాక్స్ అనే కూటమి ఏర్పడింది. ఇందులో ఉన్న.. 150 దేశాల తరఫున..యూనిసెఫ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద, అత్యంత వేగవంతమైన ఆపరేషన్‌గా అంచనా వేస్తున్నారు.