Indian Air Force New Uniform : ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లకు కొత్త యూనిఫామ్.. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకునేలా..

భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Indian Air Force New Uniform : ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లకు కొత్త యూనిఫామ్.. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకునేలా..

Indian Air force

Indian Air Force New Uniform : భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) సంయుక్తంగా రూపొందించాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 90వ రైజింగ్‌ డే రోజున ఈ మార్పును తీసుకొచ్చారు.

ఢిల్లీ ఆవల తొలిసారి ఐఏఎఫ్‌ రైజింగ్‌ డే ఉత్సవాలు జరిగాయి. చండీగఢ్‌లో నిర్వహించిన ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరీ హాజరయ్యారు. ఇదే సందర్భంలో వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ కూడా ఏర్పాటైంది. భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రభుత్వం శనివారం కొత్త యూనిఫాంను విడుదల చేసింది.

Indian Air Force : భార‌త వైమానిక ద‌ళంలో కొత్త‌గా వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇదే తొలిసారి

స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ.. వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి తెలిపారు. ఈ కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్’ అని తయారు చేశారు.

యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. కొత్త కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీ-షర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్‌రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్‌లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.