India – China Border Clash: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య.. నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు తూర్పు కమాండ్ వీటిని నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల ఘర్షణలకు నేడు, రేపు జరిగే వైమానిక దళ విన్యాసాలకు సంబంధం లేదని, ఇది ముందుగానే జారీ అయిన షెడ్యూల్ అని వాయుసేన చెబుతోంది.

India - China clash
India – China Border Clash: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ – చైనా దళాల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరుదేశాల సరిహద్దులో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తూర్పు సెక్టార్‌లో నేటి నుంచి రెండురోజులపాటు భారత వాయుసేన యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. దీనిలో ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు తూర్పు కమాండ్ వీటిని నిర్వహిస్తోంది.
అయితే, ఇటీవల ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణకు, వైమానిక దళ విన్యాసాలకు సంబంధం లేదని వాయుసేన చెబుతోంది. చాలా రోజుల ముందుగానే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధమైందని తెలిపింది. కానీ, ఇటీవల జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో ఈ వైమానిక దళ విన్యాసాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వైమానిక దళ విన్యాసాలు నేడు, రేపు (15, 16 తేదీల్లో) జరగనున్నాయి.
భారతీయ వైమానిక దళం, షిల్లాంగ్ (మేఘాలయ)లో ఉన్న ఈస్టర్న్ కమాండ్ ఈ వైమానిక దళ విన్యాసాల గురించి ఎటువంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ, తూర్పు కమాండ్‌లోని అన్ని ఎయిర్ బేస్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొనవచ్చని తెలుస్తుంది. వీటిలో అస్సాంలోని తేజ్‌పూర్, ఝబువా, జోర్హాట్ ఎయిర్ బేస్‌లు కూడా ఉండనున్నాయి. అదేవిధంగా బెంగాల్‌కు చెందిన హసిమారా, కల్తెకుండ, అరుణాచల్ ప్రదేశ్‌లోని అడ్వాన్స్ ల్యాండింగ్ స్ట్రిప్, ప్రధానంగా ఈ వైమానిక విన్యాసాల్లో పాల్గోనున్నాయి.
Galwan Valley Clash : గల్వాన్ ఘర్షణ..మరో వీడియో విడుదల
వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలు తేజ్‌పూర్ ఎయిర్ బేస్‌లో ఉండగా, రాఫెల్ యుద్ధ విమానాల స్వ్కాడ్రన్ హిసిమారాలో ఉన్నాయి. అపాచీ హెలికాప్టర్లు, రవాణా విమానాలు జోర్హాట్‍లో ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కసరత్తులో హెలికాప్టర్లు, సైనిక రవాణా విమానాలు కూడా పాల్గొంటాయి. వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఈ వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొనవచ్చు.