Indian Air Force: ఆ యుద్ధ విమానాలను వాడొద్దు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం..

మిగ్ -21 విమానాల ప్రమాదాల వల్ల ఇటీవలికాలంలో చాలా మంది ప్రమాదాలకు గురికావడం, పలువురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

Indian Air Force: ఆ యుద్ధ విమానాలను వాడొద్దు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం..

Mig-21 jets

Mig-21 Grounded: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. Mig-21 యుద్ధ విమానాల వినియోగంపై నిషేదం విధించింది. తరచూ ఈ యుద్ధ విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనెల 8న రాజస్థాన్ రాష్ట్రంలో మిగ్-21 బైసన్ విమానం కూలిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు మరణించారు. దీంతో ఈ విమానాల వినియోగంపై నిషేధం విధించారు.

Army MIG-21 Crash: రాజస్థాన్‌లో ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్.. ముగ్గురు మృతి

ఈ నిషేధం శాశ్వతంగా కాదు. రాజస్థాన్‌లో మిగ్-21 విమానం ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు వీటి వినియోగంపై నిషేధం విధించడం జరిగిందని ఎయిర్ పోర్స్ అధికారులు తెలియజేశారు. 1960లలో భారత వైమానిక దళంలోకి మిగ్-21 విమానాలను ప్రవేశ పెట్టారు. 800 రకాల యుద్ధ విమానాలు సేవలో ఉన్నాయి. మిగ్ -21 విమానాల ప్రమాదాల వల్ల ఇటీవలికాలంలో చాలా మంది ప్రమాదాలకు గురికావడం, పలువురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

MiG-21 Squadron: మిగ్-21 విమానాలకు వీడ్కోలు చెప్పనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఈ నెల 30తో ఒక స్క్వాడ్రన్ ముగింపు

భారత వైమానిక దళంలో 31 మిగ్-21 బైసన్‌తో సహా 31 ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ స్వ్కాడ్రన్‌లు ఉన్నాయి. మిగ్ యుద్ధ విమానాలు ఇటీవల వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పైలెట్లు, కో పైలెట్లు ప్రాణాలు కోల్పోవడమేకాకుండా.. సామాన్య ప్రజలుసైతం ప్రమాద సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లో మిగ్ -21 విమానం కూలి ముగ్గురు మరణించిన విషయం విధితమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మిగ్ -21 యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తాత్కాలికంగా నిషేధించింది.

MiG-21 fighter: మూడేళ్లలో మిగ్ విమానాలకు వీడ్కోలు

అధికారిక సమాచారం ప్రకారం.. గత ఆరు దశాబ్దాల్లో మిగ్-21 విమానాలు 400 ప్రమాదాలకు గురయ్యాయి. మిగిలిన మిగ్ -21 స్క్వాడ్రన్‌లను దశలవారీగా తొలగించడానికి భారత వైమానిక దళం 2025 వరకు సమయం పెట్టుకుంది.