Indian-American Woman : టెక్సాస్ జడ్జిగా భారత సంతతి మహిళ.. రెండో సారి బాధ్యతలు

టెక్సాస్ జడ్డిగా భారత సంతతి మహిళ జూ ఏ మాథ్యూ నియామకం అయ్యారు. భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నాయకురాలు జూ ఏ మాథ్యూ.. టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్డిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు.

Indian-American Woman : టెక్సాస్ జడ్జిగా భారత సంతతి మహిళ.. రెండో సారి బాధ్యతలు

Joo A Mathew

Indian-American woman : భారత సంతతి మహిళ జూ ఏ మాథ్యూ  టెక్సాస్ జడ్జిగా నియామకం అయ్యారు. భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నాయకురాలు జూ ఏ మాథ్యూ.. టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు. కేరళలోని తిరువల్ల ఆమె స్వగ్రామం. కాసరగడలోని బీమనాడే నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నాలుగేళ్ల పాలు ఆమె కౌంటీ జడ్జిగా కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ నేత ఆండ్రూపై మాథ్యూ 123,116 ఓట్ల తేడాతో గెలిచారు. ఇకపోతే 15 ఏళ్లుగా ఆమె న్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. టార్చర్, సివిల్ లిటిగేషన్, క్రిమినల్ మేటర్స్ వంటి అంశాల్లో ఆమె కేసులు వాదిస్తుంటారు.

Richard Verma: భారత సంతతి వ్యక్తికి జో బైడెన్ కీలక పదవి.. అమెరికా డిప్యూటీ సెక్రెటరీగా రిచర్డ్ వర్మ

జువెనైల్ ఇంటర్వెన్షన్, మెంటల్ హెల్త్ కోర్టుకు అధిపతిగా ఆమె కొనసాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఆమె హాజరయ్యారు. దెలావర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.