ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే : గెలిచే సత్తా ఉంటేనే శాంతి

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 10:49 AM IST
ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే : గెలిచే సత్తా ఉంటేనే శాంతి

మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్) భారత ఆర్మీ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో మన జవాన్ల ధైర్యసాహసాలను వివరిస్తూ ఉన్న ఆ పద్యం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IAF సర్జికల్ స్ట్రైక్ : పాక్ పై ‘సెటైరికల్ స్ట్రైక్’తో నెటిజన్స్ జోక్స్

ఓ శత్రువు ముందు నువ్వు నిజాయితీగా ఉంటే అది నీ చేతకానితనం అనుకుంటాడు. కౌరవులు..పాండవులను చిన్నచూపు చూసినట్లు మనం మంచి స్థాయిలో ఉండి గెలిచే సత్తా ఉంటేనే శాంతి చేకూరుతుంది. అని ఉన్న ఆ పద్యం పత్రి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ కు ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. జై భారత్, జై జవాన్, జైహింద్, అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భారత ఆర్మీని ప్రశంసిస్తున్నారు. మన సైనికుల సాహసాలు అద్భుతం అని కామెంట్లు పెడుతున్నారు. భారత ఆర్మీ ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే 40 వేలకు పైగా లైక్ లు రాగా, 18వేల రీట్వీట్లు వచ్చాయి.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

Also Read : మెరుపుదాడులపై బాలీవుడ్ స్పందన ఏంటంటే?