Uri Sector : పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న భారత ఆర్మీ!

భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మరొకరిని హతమార్చింది.

Uri Sector : పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న భారత ఆర్మీ!

Indian Army Captures Pakistani Terrorist In Uri Sector

Indian Army capture Pakistani terrorist : భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మరొకరిని హతమార్చింది. గత కొన్నేళ్లలో ఓ పాక్ ఉగ్రవాది భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా సైన్యం పట్టుకోవడం ఇదే తొలిసారి.

సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్19 తేదీల్లో ఉరి, రాంపూర్ సెక్టార్లలో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉగ్రవాదుల చొరపాటు ప్రయత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది. రాంపూర్ సెక్టార్ లోనూ ముగ్గురు పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఆ సమయంలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.
Hansika Motwani: సముద్ర తీరాన హాన్సిక పరువాల విందు!

పాక్ ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు భారత ఆర్మీ ఎల్ఓసీలోని ఉరి సెక్టార్ లో తనిఖీలు నిర్వహించింది. పాక్ ఉగ్రవాదుల వ్యూహాన్ని ముందే పసిగట్టి వారి ప్రయత్నాలను అడ్డుకుంది. ఇదే విషయాన్ని చినార్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే వెల్లడించారు.

అంతేకాదు.. పాక్ వైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కూడాతగ్గాయని అన్నారు. అదే సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. కశ్మీర్ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో వచ్చేది పండుగ సీజన్.. ఇదే సమయంలో ఉగ్రదాడులకు పాక్ ప్రయత్నించే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
Bharat Biotech : కోవాగ్జిన్‌కు WHO క్లియ‌రెన్స్ వచ్చేనా? ఎందుకీ ఆలస్యమంటే?