Army Helicopter Crashed : అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కూలిన ఆర్మీ హెలిక్యాప్ట‌ర్‌.. పైలట్ మృతి

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఆర్మీ హెలిక్యాప్ట‌ర్‌ కూలడంతో పైలట్ మృతి చెందారు. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చీతా హెలిక్యాప్ట‌ర్ అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ ఏరియాలో ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు పైల‌ట్లకు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వెంట‌నే రంగంలోకి దిగింది.

Army Helicopter Crashed : అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కూలిన ఆర్మీ హెలిక్యాప్ట‌ర్‌.. పైలట్ మృతి

indian army helicopter

Army Helicopter Crashed : అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఆర్మీ హెలిక్యాప్ట‌ర్‌ కూలడంతో పైలట్ మృతి చెందారు. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చీతా హెలిక్యాప్ట‌ర్ అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ ఏరియాలో ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు పైల‌ట్లకు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వెంట‌నే రంగంలోకి దిగింది.

గాయ‌ప‌డిన ఇద్ద‌రు పైల‌ట్‌ల‌ను చికిత్స కోసం స‌మీప మిలిట‌రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించాయి. చికిత్స పొందుతూ పైల‌ట్ లెఫ్టి క‌ల్న‌ల్ సౌర‌భ్ యాద‌వ్ మృతి చెందారు. మ‌రో పైల‌ట్‌కు వైద్యలు చికిత్స చేస్తోన్నారు. ఈ విష‌యాన్ని భార‌త ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. అయితే, ఈ హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియలేదు.

Kedarnath : అదుపు తప్పిన హెలికాప్టర్- తృటిలో తప్పిన ప్రమాదం

చీతా హెలిక్యాప్ట‌ర్‌లను 1976 నుంచి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ త‌యారు చేస్తోంది. ఈ హెలిక్యాప్ట‌ర్లను ఆర్మీ ర‌క‌ర‌కాల సేవ‌ల‌కు వినియోగిస్తున్నారు. మిగ‌తా హెలిక్యాప్ట‌ర్ల‌తో పోల్చితే అత్యంత ఎత్తుకు ఎగ‌ర‌గ‌ల హెలిక్యాప్ట‌ర్‌లుగా కూడా వీటికి పేరుంది. ఆర్మీ స్థావ‌రాల‌పై గ‌స్తీ నిర్వ‌హ‌ణ‌లో, విప‌త్తుల సందర్భంగా ర‌క్ష‌ణ‌, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో వీటిని వినియోగిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.