Indian Army : చైనాకు చెక్.. బోర్డర్‌లో భారీగా బలగాలను మోహరించిన భారత ఆర్మీ

బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో

Indian Army : చైనాకు చెక్.. బోర్డర్‌లో భారీగా బలగాలను మోహరించిన భారత ఆర్మీ

Indian Army

Indian Army : బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో 15వేలకు పైగా అదనపు సైనికులను భారత ఆర్మీ మోహరించింది. కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్స్ లో భాగంగా చైనా దళాలను ఎదుర్కోనేందుకు ఈస్ట్రన్ లద్దాఖ్ లోని నార్తర్న్ కమాండ్ ఏరియాలో కొన్ని నెలల క్రితమే ఇండియన్ ఆర్మీ బలగాలను మోహరించింది. నార్తర్న్ కమాండ్ ఏరియా నుంచి వేరు చేసి కౌంటర్ టెర్రరిజమ్ డివిజిన్ ఏర్పాటు చేశారు.

ఒక్కో డివిజన్ లో 15వేల ట్రూప్స్ ఉంటాయి. లద్దాఖ్ లో చైనా ఆర్మీ దురాక్రమణకు యత్నిస్తే మన దళాలు అడ్డుకుంటాయి. ఈ బలగాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద పర్వతాలపైన, చల్లని ఎడారి ప్రాంతాల్లో పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఈ బలగాలకు శిక్షణ ఇచ్చారు. ఈస్ట్రన్ లద్దాఖ్ సెక్టార్ లో భారత ఆర్మీ 50వేలకు పైగా ట్రూప్స్ ని మోహరించింది. తద్వారా బలగాల సంఖ్యను రెట్టింపు చేసినట్టు అయ్యింది.

చైనా దురాక్రమణను దృష్టిలో పెట్టుకుని లేహ్ లో 14 కార్స్ ఉంచింది. అంతేకాదు అదనపు ఆర్మర్డ్ యూనిట్లను కూడా మోహరించింది. ఈ మధ్య కాలంలో చైనా ఆర్మీ బరి తెగిస్తోంది. బోర్డర్ లో దురాక్రమణలకు పాల్పడుతోంది. పలు మార్లు దురాక్రమణలకు పాల్పడింది. అయితే భారత ఆర్మీ అంతే ధీటుగా చైనాకు బదులిచ్చింది. డ్రాగన్ ఆర్మీ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టింది. వారి దురాక్రమణలను అడ్డుకుంది. చైనా దళాలకు సమానంగా బోర్డర్ లో ఇండియన్ ఆర్మీ దళాలను రంగంలోకి దింపింది.

కాగా, గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. భారత్ సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. భారత సైనికులు కూడా ధీటుగానే బదులిచ్చారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి చొరబడకుండా అడ్డుకున్నారు. కాగా, ఈ ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ అప్రమత్తం అయ్యింది. సరిహద్దుల వెంబడి సైనికులను మరింత ఎక్కువగా మోహరించింది. భద్రతను బలోపేతం చేసింది.