హిమాలయాల్లో మంచు మనిషి: భారత్ ఆర్మీ ట్వీట్

  • Edited By: vamsi , April 30, 2019 / 02:56 AM IST
హిమాలయాల్లో మంచు మనిషి: భారత్ ఆర్మీ ట్వీట్

హిమాలయ పర్వతాల్లో ఋషులు, దేవతలు తిరుగుతూ ఉంటారని వార్తలు వింటూనే ఉంటాం అయితే వాటికి సరైన ప్రూఫ్‌లు మాత్రం ఇప్పటివరకు లేవు. అయితే అప్పుడప్పుడూ పాదాలు కనిపించాయి. మంచు మనుషులు తారసపడ్డారు అనే మాటలను మాత్రం వింటుంటాం. అయితే తాజాగా ఇటువంటి విషయానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. హిమాలయాల్లోని మంచుకొండల్లో పర్వతారోహణ సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికులకు మంచు మనిషి పాదముద్రలు కనపడగా వాటిని ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు సైనికులు. ఏప్రిల్ 9వతేదీన హిమాలయ పర్వతాల్లోని మకలు బేస్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లిన భారత సైనిక బృందం మంచు మనిషి తిరిగిన ఆనవాళ్లను గుర్తించారు. ఆ ఆనవాళ్లను ఫోటోలు తీసిన భారత సైన్యం ఫోటోలను పెట్టింది.

వారు పెట్టిన పోస్ట్ ప్రకారం మంచు మనిషి పాద ముద్ర 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉందని  చెబుతున్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి సంధర్భాలు చోటు చేసుకోగా.. ఆంజనేయ స్వామి రూపం పర్వతాల్లో తిరుగుతుందని వార్తలు వినిపించాయి.