Army Fire : ఉగ్రవాదులనుకుని కూలీలపై ఆర్మీ కాల్పులు.. 11 మంది మృతి

నాగాలాండ్‌లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.

Army Fire : ఉగ్రవాదులనుకుని కూలీలపై ఆర్మీ కాల్పులు.. 11 మంది మృతి

Army

Army fire on labours : నాగాలాండ్‌లో ఉగ్రవాదులుగా ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన తిరు గ్రామానికి సమీపంలో జరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వాహనంపై కూలీల బృందం తిరు గ్రామం నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులుగా భావించిన భద్రతా బలగాలు.. వాహనంపై కాల్పులు జరపడంతో 11 మంది పౌరులు ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు కొన్ని భద్రతా దళాలకు సంబంధించి వాహనాలకు నిప్పు పెట్టారు.

No Mask No Entry : మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి

అంతకముందు నాగాలాండ్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామం వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు మృతి చెందారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.

అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనంపై ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 11 మంది పౌరులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు జవాన్ల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మోన్ జిల్లాలో ఓటింగ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.