Indian Army 3D House : సైనికుల కోసం..3D హౌస్‌ నిర్మించిన ఇండియన్‌ ఆర్మీ .. జస్ట్ బటన్‌ నొక్కితే చాలు ఇల్లు రెడీ

సైనికుల కోసం..3D హౌస్‌ నిర్మించింది ఇండియన్‌ ఆర్మీ. ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లా..తాపీ మేస్త్రీలు అవసరం లేదు.. జస్ట్‌.. ఇంటి స్థలం ఒక్కటి చాలు.. కాంక్రీట్‌ మిక్సర్‌తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు అంటోందీ కొత్త టెక్నాలజీ.. ఇల్లు ఎలా కావాలో డిజైన్‌ చేసి.. అన్నీ ఓకే అనుకుంటే.. జస్ట్ బటన్‌ నొక్కితే చాలు.. ఇంటి నిర్మాణం మొదలైపోతుంది. జస్ట్‌.. ఓ ఫ్లెక్సీ ప్రింట్‌ చేసినట్టు.. ఓ పాంప్లేట్‌ ముద్రించినట్టు.. కాంక్రీట్‌తో ఇంటిని ప్రింట్‌ చేసేస్తోంది. త్రీ డైమెన్షనల్‌ డైరెక్షన్‌లో కాంక్రీట్‌తో ఇల్లు కట్టిపడేస్తోంది.

Indian Army 3D House : సైనికుల కోసం..3D హౌస్‌ నిర్మించిన ఇండియన్‌ ఆర్మీ .. జస్ట్ బటన్‌ నొక్కితే చాలు ఇల్లు రెడీ

Indian Army first 3D House

Indian Army first 3D House : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనేవారు పెద్దలు. ఇల్లు కట్టడమంటే.. అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దానర్థం.. ఇల్లు కడదామని డిసైడ్‌ అయిన వెంటనే.. ఎంత స్థలం కావాలి.. ఏ సిమెంట్‌ వాడాలి.. ఎలాంటి ఇటుకలు తేవాలి.. బడ్జెట్ ఎంత అవుతుంది. ఏ కాంట్రాక్టర్ కు ఇవ్వాలి? ఎవరు బాగా కడతారు? నైపుణ్యమున్న పనివాళ్లు దొరుకుతారో లేదో.! ఇలా ఎన్నో డౌట్లు, ఆలోచనలు. కానీ అంత అవసరంలేదు..లేటెస్ట్‌ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ. ఏమాత్రం టెన్షన్‌ లేకుండా ఇల్లును చకచకా కట్టేయొచ్చట..!! సొంతిల్లు కట్టుకోవాలా? డోంట్ వర్రీ..జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అంటోంది లేటెస్ట్‌ త్రీ డైమెన్షనల్‌ ప్రింటింగ్ టెక్నాలజీ..!!

ఎక్కడైనా.. ఎప్పుడైనా.. జస్ట్‌ కొన్ని వారాల్లోనే ఇల్లు రెడీ చేసేస్తోంది ఈ న్యూ త్రీ డీ టెక్నాలజీ. ఇటుకలతో పనిలేదు.. మేస్త్రీలతో అవసరం లేదు.. జస్ట్‌.. ఇంటి స్థలం ఒక్కటి చాలు.. చకచకా రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ 3డీ. కాంక్రీట్‌ మిక్సర్‌తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మిస్తోంది.. ఇల్లు ఎలా కావాలో డిజైన్‌ చేసి.. అన్నీ ఓకే అనుకుంటే.. జస్ట్ బటన్‌ నొక్కితే చాలు.. ఇంటి నిర్మాణం మొదలైపోతుంది. జస్ట్‌.. ఓ ఫ్లెక్సీ ప్రింట్‌ చేసినట్టు.. ఓ పాంప్లేట్‌ ముద్రించినట్టు.. కాంక్రీట్‌తో ఇంటిని ప్రింట్‌ చేసేస్తోంది. త్రీ డైమెన్షనల్‌ డైరెక్షన్‌లో కాంక్రీట్‌తో ఇల్లు కట్టిపడేస్తోంది.

ఇంత స్పీడ్‌గా.. కూలీల అవసరం లేకుండా.. చకచకా నిర్మాణం సాగిపోయే ఈ త్రీడీ ప్రింటెడ్‌ టెక్నాలజీపై ఆసక్తి చూపిన ఇండియన్‌ ఆర్మీ.. సైనిక అవసరాల కోసం ఓ మోడల్‌ త్రీడీ హౌస్‌ను నిర్మించింది. కేవలం 12 వారాల్లో.. 71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్‌ వన్‌ హౌస్‌ను నిర్మించింది ఆర్మీ. అహ్మదాబాద్ కంటోన్మెంట్‌లో నిర్మించిన ఈ త్రీడీ హౌస్‌ చూపరులను కట్టిపడేస్తోంది. పార్కింగ్‌, గ్యారేజ్‌, స్టెయిర్‌ కేస్‌లతో సహా చక్కగా.. అండ్‌ సింపుల్‌గా మోడ్రన్‌ హౌస్‌ నిర్మాణం పూర్తయిపోయింది. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ అంటున్నారు అంత బలంగా ఉంటుందా? అనే అనుమానాలు అవసరం లేదు.. భూకంపాలను కూడా తట్టుకునేంత పటిష్టంగా.. పర్యావరణ హితమైన మెటీరియల్స్‌తో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారట ఈ బిల్డింగ్‌ని.

మైకాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో కలిసి.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌ ఈ త్రీడీ హౌస్‌ను నిర్మించింది. అహ్మదాబాద్‌లోని గోల్డెన్‌ కటార్‌ డివిజన్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించింది. ఈ మోడ్రన్‌ యుగంలో వేగవంతమైన ఇంటి నిర్మాణానికి ఓ మోడల్‌గా నిలుస్తోందీ ఇల్లు. ఈ త్రీడీ హౌస్‌ నిర్మాణంలో అత్యాధునిక 3 డీ ర్యాపిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. 3 డీ ప్రింటెడ్ ఫౌండేషన్, వాల్, స్లాబ్‌లను నిర్మించారు. ఈ త్రీడీ ప్రింటెడ్‌ టెక్నాలజీ ఆర్మీ సిబ్బంది ఇళ్ల డిమాండ్‌ను తీర్చగలదని భావిస్తున్నారు ఆర్మీ అధికారులు.

ఇంటి డిజైన్‌, నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలను ఫైనలైజ్‌ చేసిన తర్వాత డేటాను మెషీన్‌లోకి ఫీడ్ చేస్తే.. యంత్రాలు చకచకా నిర్మాణానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేయడంతో పాటు.. పనులు మొదలుపెడతాయి. మూడు డైమెన్షన్లలో కొలతల ప్రకారం.. 3 డీ ప్రింటర్ల సాయంతో ఇల్లు నిర్మిస్తుంది. ఐరన్ వస్తువులను అమర్చితే.. కాంక్రీట్‌ను ఫిల్‌ చేసుకుంటూ వాల్స్‌, స్లాబ్‌ను కూడా పూర్తి చేసేస్తుంది త్రీడీ టెక్నాలజీ.

చైనా బోర్డర్‌ ఎల్వోసీ.. పాక్‌ బోర్డర్‌లో నెలకొన్న అత్యవసర.. రక్షణకు సంబంధించిన సవాళ్ల నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ ఇప్పటికే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. అవసరమైన చోట.. సైనికుల కోసం వేగంగా నివాసయోగ్యంగా నిర్మాణాలు చేయడంతో పాటు.. శాశ్వత ప్రాతిపదికన ఉండేలా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే.. సైనికులను సిద్ధంగా ఉంచడంతో పాటు.. సైనికుల తరలింపులో జాప్యాన్ని నివారించే దిశగా ఆర్మీ ఈ తరహా నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఇలాంటి శాశ్వత.. వేగవంతమైన నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది ఇండియన్‌ ఆర్మీ.