Army Chief Manoj Pandey: చైనా సరిహద్దు సురక్షితం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం

జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. సైన్యానికి చెందిన 25 నుంచి 28 భవనాలకు పగుళ్లు రావడంతో జవాన్లను తాత్కాలికంగా మార్చామని, అవసరమైతే జవాన్లను శాశ్వతంగా ఔలీలో మోహరిస్తామని తెలిపారు.

Army Chief Manoj Pandey: చైనా సరిహద్దు సురక్షితం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం

General Manoj Pande on

Army Chief Manoj Pandey: ఇండియా, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై ఆర్మీ చచీఫ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. చైనాతో సైనిక, దౌత్య స్థాయిలో నిరంతర చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తర సరిహద్దులో పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకాదు, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంపై ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో శాంతినెలకొందని అన్నారు.

MANOJ PANDEY: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

చైనాతో చర్చలకు సంబంధించి ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. టేబుల్ చర్చల్లో ఏడు అంశాల్లో ఐదు అంశాలు పరిష్కారం అయ్యాయని అన్నారు. జమ్మూ కశ్మీర్ కాల్పుల విరమణ గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గినట్లు చెప్పారు. ఎల్ఏసీ మా వైపు మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందాయన్న జనరల్ మనోజ్ పాండే.. సరిహద్దుల్లో ఐదు సంవత్సరాల్లో ఆరువేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించడం జరిగిందని అన్నారు.

 

2,100 కిలో మీటర్లు ఉత్తర సరిహద్దులో నిర్మాణ పనులు జరిగాయన్న ఆయన, 7,450 మీటర్ల వంతెన నిర్మాణం కూడా జరిగిందని తెలిపారు. లోయను లడఖ్‌ను కలిపే జోజిలా సొరంగం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుందని ఆర్మీచీఫ్ తెలిపారు. గత మూడేళ్లలో మౌలిక సదుపాయాల కోసం 13వందల కోట్లు ఖర్చుచేసినట్లు జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆయన మాట్లాడుతూ.. సైన్యానికి చెందిన 25 నుంచి 28 భవనాలకు పగుళ్లు రావడంతో జవాన్లను తాత్కాలికంగా మార్చామని, అవసరమైతే జవాన్లను శాశ్వతంగా ఔలీలో మోహరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజలకు సహాయం అందించేందుకు మేము మా ఆస్పత్రులు, హెలిప్యాడ్‌లు మొదలైనవాటిని పౌర పరిపాలనకు ఇచ్చామని తెలిపారు.