ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 1.77లక్షల వరకూ జీతం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 1.77లక్షల వరకూ జీతం

మీరు ఇంజినీరింగ్ చదివారా.. అయితే మీకు అద్భుత ఉద్యోగ అవకాశం. బీటెక్, బీఈలో ఏ గ్రూపు అయినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. joinindianarmy.nic.inలోకి వెళితే అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)టెక్నికల్ కోర్సు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు రెండు విభాగాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి..
* షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్నికల్ పురుషులు) 56(ఏప్రిల్ నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది)175పోస్టులు
* షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్ మహిళలు) 27 (ఏప్రిల్ 2021నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది) 14పోస్టులు



కేటగిరీల వారీగా ఖాళీలు
సివిల్ – పురుషులు 3పోస్టులు
మెకానికల్ ఉమెన్ – 15 పురుషులు, మహిళలు 01
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ – 16 (పురుషులు), 02 (మహిళలు)
కంప్యూటర్ సైన్స్, ఐటి – 47 (పురుషులు), 04 (మహిళలు)
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 21 (పురుషులు), 02 (అవివాహిత)
ఎలక్ట్రానిక్స్ – 03 పోస్టులు (పురుషులు)
మైక్రో ఎలక్ట్రానిక్స్ & మైక్రోవేవ్ – 03
ఆర్కిటెక్చర్ – 01 (పురుషులు), 01 (మహిళలు)
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ – 01
ఏరోనాటికల్ – 05 (పురుషులు), 01 (మహిళలు)
ఏవియానిక్స్ – 05
ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ – 05
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 02 పోస్టులు
ఇన్స్ట్రుమెంటేషన్ – 02 పోస్టులు
టెక్స్‌టైల్ – 01
ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ – 01

మొత్తం పోస్టుల సంఖ్య – 191

పే స్కేల్ – నెలకు రూ. 56వేల 100 నుంచి రూ .లక్షా 77వేల 500 వరకు

అర్హతలు
సంబంధిత స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. రిజర్వు కేటగిరీల వారికి వయస్సులో రిలాక్సేషన్ ఉంటుంది.

ఎంపిక ఎలా:
ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (పిఇటి), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా కోర్సుకు అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు.