చైనాపై గురిపెట్టిన భోఫోర్స్ శతుఘ్నలు, ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఇండియా

  • Published By: murthy ,Published On : September 16, 2020 / 07:52 PM IST
చైనాపై గురిపెట్టిన భోఫోర్స్ శతుఘ్నలు, ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఇండియా

India- China standoff in Ladakh: లఢక్ మీద శాతాకాలం గాలులు అప్పుడే వీస్తున్నట్లు అనిపిస్తున్నా,ఇండో-చైనా సరిహద్దుల్లో యుద్ధవిమానాల జోరు పెరిగింది. ప్రస్తుతానికి అంతా ఓకే. అయినా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే.. ఇండియన్ ఆర్మీ వింటర్ ప్రిపరేషన్స్‌ మొదలుపెట్టింది. సరిహద్దులకు భారీగా బలగాలతో పాటు యుద్ధ విమానాలను కూడా తరలించింది.

చైనా నుంచి దాడి ఎదురైతే.. తిప్పికొట్టేందుకు ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఉంది ఇండియా. ఇప్పుడు గనక డ్రాగన్ ఓవరాక్షన్ చేస్తే.. ఖతర్నాక్ కౌంటర్ ఇవ్వాలని డిసైడైంది.



ఇండియాకు అర్థమైపోయింది భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గవని. అందుకే కమ్ముకున్న యుద్ధ మేఘాలమధ్య వార్‌కు రెడీ. యుద్ధం భారత్ మొదలుపెట్టకపోయినా శత్రుదేశం చైనా నుంచి వచ్చే దాడిని వెంటనే తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇండో-చైనా బోర్డర్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఎల్ఏసీ వెంట మూమెంట్స్‌ని ఇండియన్ ఆర్మీ స్పీడప్ చేసింది. సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది. కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ఉన్న వాటిని సర్వీసింగ్ చేసి సిద్ధంగా ఉంచుతోంది. ఈ చర్యలన్నింటితో యుద్ధానికి భారత్ ఎప్పుడైనా సిద్ధమనే సిగ్నల్ పంపుతోంది చైనాకు.



మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న లేహ్ ప్రాంతం.. ఇప్పుడు బిజీ. యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల శబ్దాలు.. లేహ్‌లో రీసౌండ్ వస్తున్నాయ్. క్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వస్తున్నాయ్ బలగాలను దింపుతున్నాయ్. సైనికులకు కావాల్సిన ఆయుధ సామాగ్రి, ఆహార అవసరాలు తీర్చే సరుకులను డెలివరీ చేస్తున్నాయ్.

2019 beginning of August, Indian Army in Kashmir increased the numbers in srinagar. Government issued new advice to avoid all travel to Jammu and Kashmir.

సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలుదువ్వితే దీటైన జవాబిచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం సరిహద్దుల్లో యుద్ధవిమానాలను మోహరించి.. డ్రాగన్ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎల్ఏసీ వెంట యుద్ధ హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయ్. డేగ కళ్లతో.. పహారా కాస్తున్నాయ్.