భారత ఆర్మీకి కాశ్మీర్, పాకిస్తానీ నెటిజన్ల మద్దతు.. ‘హీరోస్’ అంటూ ప్రశంసలు

భారత ఆర్మీకి కాశ్మీర్, పాకిస్తానీ నెటిజన్ల మద్దతు.. ‘హీరోస్’ అంటూ ప్రశంసలు

Indian Army Suddenly Hailed As Heroes : భారత ఆర్మీకి కాశ్మీర్, పాకిస్తానీ నెటిజన్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. భారత బలగాలను ఆకస్మాత్తుగా హీరోస్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భారత సైన్యం పాకిస్తాన్ ప్రజల ప్రశంసలను పొందింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఇద్దరు మైనర్ బాలికలను తిరిగి స్వదేశానికి పంపించారు భారత సైనికులు. ఓ ఇద్దరూ సోదరీమణులు అనుకోకుండా నియంత్రణ రేఖను దాటడంతో భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు.

లైబా జబైర్, (17), సనా జబైర్, (13), ఇద్దరూ కహుటాలోని అబ్బాస్పూర్ తహసీల్ గ్రామంలో నివసిస్తున్నారు. నియంత్రణ రేఖ భారత సరిహద్దు దాటిన వారిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది.మైనర్ బాలికలకు ఎటువంటి హాని జరగకుండా సంపూర్ణ సంయమనం పాటిస్తున్నట్లు భారత సైన్యం హామీ ఇచ్చింది. ఇద్దరు బాలికలు కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాక ఇంటి నుంచి వెళ్లిపోయారు.

కానీ, ఈ విషయంలో అలాంటిదేమీ ప్రస్తావించలేదని పాకిస్తాన్ స్థానిక మీడియా తెలపడం గమనార్హం. ఈ సంఘటనపై అబ్బాస్‌పూర్ అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ తసావర్ హుస్సేన్ కజ్మి విచారణ జరిపించారు. ఇదో హృదయ విదారక కథ అన్నారు. ఇద్దరు అమ్మాయిల తండ్రి ఆరు నెలల క్రితం మృతిచెందినట్టు తెలిపారు. ఆ తరువాత ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారని చెప్పారు. ఇంటిలో ప్రతిరోజూ గొడవలకు దారితీసిందని ఆయన వెల్లడించారు. ఈ దుర్భర పరిస్థితి కారణంగానే వారు ఇలా సరిహద్దు దాటాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇద్దరు బాలికలు 24 గంటల కన్నా తక్కువ కస్టడీలో గడిపారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారుల సమక్షంలో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు సమీపంలో ఉన్న చకన్ డా బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద వారిని వదిలేశారు. భారత సైన్యం వారికి స్వీట్లు, బహుమతులు ఇచ్చి మరి పాకిస్తాన్ కు పంపించారని లైబా జుబైర్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. మేము వెళ్లే మార్గాన్ని మరిచిపోయాం.. అనుకోకుండా భారత సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించాము. సైనికులు మమ్మల్ని కొడతారని మేము భయపడ్డామని లైబా చెప్పారు.

భారత సైనికులు మాతో బాగా కలిసిపోయారు. మాకు ఆహారం, ఉండటానికి ఒక స్థలాన్ని ఇచ్చారు. బాగా చూసుకున్నారు. మొదట, వారు మమ్మల్ని ఇంటికి వెళ్లనివ్వరు అని మేము అనుకున్నాము. కాని ఈ రోజు మనం ఇంటికి తిరిగి వెళ్తున్నాము. భారత సైనికులు నిజంగా చాలా మంచివారు’ అంటూ ప్రశంసించింది. పాక్ పౌరుల పట్ల భారత సైన్యం చూపించిన ఔదర్యానికి కశ్మీర్, పాక్ నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దయాది పాకిస్తాన్, భారత ఆర్మీకి మధ్య దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, పౌరులను పొట్టనపెట్టుకున్నారంటూ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడటమే కాకుండా దేశంలో దాడులకు సహకరించినందుకు పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ప్రతిఘటిస్తూనే ఉంది.

గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దు చేసిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌ను ప్రత్యేక హోదాను తొలగించింది. ఇరుదేశాల సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన, సరిహద్దుల్లోకి చొరబడటం వంటి చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఎల్ఒసి వెంబడి పాకిస్తాన్ 3,186 కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడగా, గత 17 ఏళ్లలో ఇదే అత్యధికం.