Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు

ఇంగ్లండ్ టెస్టు రెండో రోజున జడేజా అవుటైన తర్వాత బుమ్రా రెచ్చిపోయి ఆడారు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. బుమ్రా కొట్టిన సిక్సర్లలో ఒకటి నోబాల్ కూడా ఉంది.

Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు

Bumrah

Bumrah world record : టెస్ట్ క్రికెట్ లో భారత కెప్టెన్ జన్ ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా బుమ్రా రికార్డు నెలకొల్పారు. బర్మింగ్ హామ్ టెస్టులో ఓవర్ లో బుమ్రా 29 పరుగులు చేశారు. స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లో 29 పరుగులు చేశారు. ఓవర్ లో స్టువర్ట్ బ్రాడ్ మొత్తం 35 పరుగులు ఇచ్చాడు. లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును బుమ్రా అధిగమించారు. టీ20 వరల్డ్ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లో యువరాజ్ సింగ్ 36 పరుగులు చేశారు.

ఇంగ్లండ్ టెస్టు రెండో రోజున జడేజా అవుటైన తర్వాత బుమ్రా రెచ్చిపోయి ఆడారు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. బుమ్రా కొట్టిన సిక్సర్లలో ఒకటి నోబాల్ కూడా ఉంది. దానికితోడు ఆ ఓవర్లో బ్రాడ్ వేసిన ఒక వైడ్ బాల్ బౌండరీకి వెళ్లింది. దీంతో ఏకంగా ఆ ఓవర్లో 35 పరుగులు వచ్చాయి. వీటిలో బుమ్రా సాధించిన పరుగులు 29. టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.

Jasprit Bumrah On Fire : బుమ్ బుమ్ బుమ్రా.. చెలరేగిన పేసర్.. ఇంగ్లండ్ ఓపెనర్లు ఔట్

అంతకముందు ఈ రికార్డు క్రికెట్ లెజెండ్ బ్రయాన్ లారా పేరిట ఉండేది. రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా ఒక్క ఓవర్ లో 28 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చి ఓవర్ వేసిన ఆటగాడిగా బ్రాడ్ కూడా ఒక చెత్త రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో కూడా ఒక్క ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు బ్రాడ్ పేరిట ఉంది. 2007లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో బ్రాడ్ వేసిన ఓవర్ లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ ఇండియాతో మ్యాచ్‌లోనే బ్రాడ్ మరో చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.