Sea cucumber : రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవుల్ని తరలిస్తున్న స్మగ్లర్ల ఆటకట్టించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

పర్యావరణాన్ని కాపాడడంలో కీలకపాత్ర వహించే సముద్రపు జీవుల్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల్ ఆట కట్టించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం.రూ.8 కోట్ల విలువైన జీవుల్ని స్వాధీనం చేసుకుంది

Sea cucumber : రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవుల్ని తరలిస్తున్న స్మగ్లర్ల ఆటకట్టించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

Sea Cucumber Smuggling

Sea cucumber smuggling : స్మగ్లర్ల దురాగతాలకు ఎన్నో అరుదైన జంతువులు, జీవులు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. జంతువులు, పాములు, అరుదైన ప్రాణులు ఇలా డబ్బుల కోసం స్మగ్లర్లు విదేశాలకు తరలించేస్తున్నారు. వేయి కళ్లతో నిఘా పెట్టినా స్మగ్లర్ల ఆగడాలు ఆగటంలేదు. ఈక్రమంలో అత్యంత అరుదైన సముద్రజీవులను శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ బృందం పట్టుకుంది. వారి నుంచి దాదాపు రూ.8కోట్ల విలువైన కుకుంబర్స్ అనే సముద్రపు జీవుల్ని స్వాధీనం చేసుకుంది.

Read more : Lovers: ఇంజనీరింగ్ చదవి గంజాయి వ్యాపారం చేస్తున్న ప్రేమికులు!

గత కొన్ని రోజుల నుంచి స్మగ్లర్లపై నిఘాను పెంచిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పక్కా సమాచారంతో రెక్కి నిర్వహించి రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులను కోస్ట్‌ గార్డ్‌ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు అటవీశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో స్మగ్లర్ల ఆట కట్టించారు. వారినుంచి సుమారు రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులను (సీ కుకుంబర్‌) స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఈ సముద్రపు జీవులు రెండు టన్నులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సముద్ర జీవులను అక్రమంగా శ్రీలంకకు తరలిస్తున్నారని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమకు అందిన సమాచారాన్ని బట్టి ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం రెక్కి నిర్వహించింది.

Read more : పాపం..తెల్లకాకి తిప్పలు..ఇలా పుట్టడమే నా పాపమా?..

ఈ క్రమంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ బే ప్రాంతాలలో కోస్ట్ గార్డ్ బృందాలు అనుమానాస్పదంగా కనిపించిన ఓ బోటును పంబన్ సమీపంలో గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోటును అడ్డుకున్నారు. ఆ బోటులో తనిఖీలు నిర్వహించగా..200 డ్రమ్ములలో రెండు వేల కిలోల సీ కుకుంబర్‌ జీవులు ఉన్నట్లు గుర్తించామని వాటిని స్వాధీనం చేసుకున్నామని..వాటి ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉండవచ్చని కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు.

కాగా..సముద్రంలో జీవించే సీకుకుంబర్‌లు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తాయి. పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సీ కుకుంబర్లు చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో సీకుకుంబర్‌ జీవులను 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం.. అంతరించిపోతున్న జాతిగా పరిగణిస్తారు. చైనా, ఆగ్నేయాసియా దేశాల్లో సీకుకుంబర్‌ జీవులను అధిక డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వీటిమీద పడింది. అలా వాటిని పట్టుకుని డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా దేశాల్లో ఈ సీ కుకుంబర్లను ఆహారంగా తింటారు. అంతేకాదు వీటిని పలు ఔషధాల్లో వినియోస్తారు. అందుకే వాటికి అంత డిమాండ్. ఈ డిమాండ్ తోనే వాటి మనుగడకే ముప్పు ఏర్పడుతోంది.