Indian Masks: వైరస్‌ను ట్రాప్ చేసి చంపేసే ఇండియన్ కంపెనీ మాస్క్

కరోనా లాంటి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుతున్న బెస్ట్ ఆయుధం మాస్క్. అదెంత ఉత్తమంగా పనిచేస్తే మనకంత క్షేమం. విదేశీ టెక్నాలజీతో తయారైన మాస్క్ లను ఇక్కడకు తెప్పించుకునీ వాడుతున్నారు ప్రముఖులు.

Indian Masks: వైరస్‌ను ట్రాప్ చేసి చంపేసే ఇండియన్ కంపెనీ మాస్క్

Keeo Life

Indian Masks: కరోనా లాంటి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుతున్న బెస్ట్ ఆయుధం మాస్క్. అదెంత ఉత్తమంగా పనిచేస్తే మనకంత క్షేమం. విదేశీ టెక్నాలజీతో తయారైన మాస్క్ లను ఇక్కడకు తెప్పించుకునీ వాడుతున్నారు ప్రముఖులు. మరికొందరేమో ఇక్కడే దొరికిన వాటిలో బెటర్ గా ఉన్నదాన్ని కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ.. ఓ ఇండియన్ కంపెనీ ఐదు లేయర్లతో కూడిన మాస్క్ ను తయారుచేస్తుంది.

యాంటీ మైక్రోబయల్ కోటింగ్ తో రెడీ అవుతున్న మాస్క్.. వాతావరణంలోని కాలుష్యాన్ని, వైరస్ లను లోపలికి పోనియకుండా అడ్డుకుంటుంది. దీని నిర్మాణం వైరస్ ను అడ్డుకోవడమే కాకుండా దానిని పట్టి ఉంచి నాశనం చేస్తుంది. దీనినే సెల్ఫ్ శానిటైజింగ్ లేయర్ అని అంటుంది కంపెనీ.

Keeo Life అనే ఇండియన్ కంపెనీ.. ఇన్నోవేషన్ లో భాగంగా.. వాతావరణంలోని SARS-CoV2ను 90శాతం మేర నాశనం చేయగలదు. ఈ సెల్ఫ్ శానిటైజింగ్ N95/FFP2మాస్కులను Keeo Pro+ పేరుతో లాంచ్ చేయనున్నారు.

మా Keeo Pro+ సిరీస్ మాస్కులు పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఉండే సెల్ఫ్ శానిటైజింగ్ లేయర్ రెండు గంటల్లోనే 90శాతం వైరస్ ను తుదముట్టిస్తుంది. డిమాండ్ ను బట్టి దాదాపు 2మిలియన్ మాస్కులు హర్యానాలోని కుండ్లీలో తయారుచేస్తున్నాం. మానవులను కాపాడాలనే దృష్టితో 2మిలియన్ మాస్కులను డొనేట్ చేస్తున్నామని డైరక్టర్ కీయో లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ అమిత్ జైన్ అన్నారు.

ఇప్పటికే యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్కూల్ కు వెళ్లే పిల్లలకు మాస్క్ తప్పనిసరి చేసింది. ఇప్పుడదే టెక్నిక్ ను ఇండియాలోనూ వాడనున్నారు. ఇప్పటికే 60శాతం వరకూ వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి జరగకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కొవిడ్ వేవ్ బారిన పడకుండా ఉండాలంటే ఇటువంటి మాస్క్ లు తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు.

పలు షేపులతో పాటు, కలర్ ఆధారంగా తయారుచేస్తుండటంతో కావాల్సిన మోడల్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు. పైగా ఈ కంపెనీకి ఫుడ్స్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ (ఎఫ్‌డీఏ), యూఎస్ఏ నుంచి ఎమెర్జెన్సీ ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందిన తొలి ఇండియన్ ఆర్గనైజేషన్ ఇది.