ఇండియాలో మరికొద్ది రోజుల్లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇండియాలో మరికొద్ది రోజుల్లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Fuel-prices-Hike

Fuel prices: ఇండియన్ వినియోగదారులకు కొద్ది నెలలుగా షాక్ ఇస్తూనే ఉన్నాయి ఇందన ధరలు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 50డాలర్లకు మించిన ధరలు పలుకుతూ వస్తుంది. గ్లోబల్ డిమాండ్ రికవరీ దృష్ట్యా తొలిసారి భారీ స్థాయిలో పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరగడంతో పెట్రలో, డీజిల్ వంటి ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ గా ఎగసిపడుతున్నాయి.

దేశీయ మార్కెట్లో లీటరుకు పెట్రోల్ 2.6పెరిగితే, డీజిల్ లీటరుకు రూ.3.4పెరిగింది. నవంబర్ నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 11డాలర్లు పెరగ్గా(28 శాతం), వ్యాక్సిన్ అతి త్వరలోనే వచ్చేస్తుందనే వార్త కూడా ఇందన ధరల డిమాండ్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ కు అప్రూవ్ ఇచ్చేశాయి. మరికొన్ని మాత్రం ఫార్మా కంపెనీల రిక్వెస్ట్‌లను హోల్డ్‌లో ఉంచాయి.

కొవిడ్ కంటే ముందు ఉన్న పెట్రోల్ డిమాండ్ కంటే ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ డిమాండ్ మరింత పెరిగింది. డీజిల్, జెట్ ఫ్యూయెల్ లాంటి ఇందన డిమాండ్లు ఏప్రిల్ నుంచి తగ్గిపోతూనే ఉన్నాయి.

అంతర్జాతీయ ధరలు పెరుగుతుండటం ఆయిల్ కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా దేశీవాలీ ఇందన ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.71గా ఉంటే దాదాపు రికార్డు రేటు రూ.84కు కాస్త వ్యత్యాసమే ఉందని అర్థమవుతోంది. ముంబైలో నవంబరు నుంచి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్ రూ.90.34, రూ.80.51గా ఉన్నాయి.

స్టేట్ ఆయిల్ కంపెనీలు రోజువారీ లెక్కన దేశీవాలీ రేట్లను అంతర్జాతీయ ధరలతో పోల్చి మారుస్తూనే ఉంటాయి. కానీ, 2020లో కంపెనీలు మాత్రం వారాలు, నెలల పాటు స్థిరంగా ఉంచుతూ వస్తున్నాయి. దేశీవాలీ రేట్లతోనే నడిపిస్తున్నాయి. ట్యాక్సులు పెరగడంతో దేశీవాలీ ధరలు కూడా పెరిగాయి. ఇక అంతర్జాతీయ ధరల డిమాండ్ పెరిగిన క్రమంలో ఇండియాలో కూడా అంతర్జాతీయ ధరలను అమలు చేస్తే పెట్రోల్, డీజిల్ వినియోగదారులు ఆకాశాన్నంటే ధరలు చూడాల్సిందే.