SWISS BANK : స్విస్‌బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల డిపాజిట్లు..14 ఏళ్లలో ఇది అత్యధికం..
స్విస్ బ్యాంక్‌ల్లో భారతీయుల పెట్టుబడులు, డిపాజిట్లు ఒక్క ఏడాదిలో గణనీయంగా పెరిగాయ్. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు.. ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. 2021లో భారతీయుల సంపద 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు.. అంటే మన కరెన్సీలో 30వేల 500 కోట్లకు చేరింది.

SWISS BANK : గుప్తనిధులకు స్వర్గధామంగా లెక్కకట్టే స్విస్ బ్యాంక్‌ల్లో… భారతీయులు దాచుకున్న సొమ్ము భారీగా పెరిగింది. మనదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు… స్విస్ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ రయ్‌న దూసుకుపోయింది. అధికారికంగా బయటపడిన లెక్కలే అవాక్కయ్యేలా చేస్తుంటే.. అనధికారికంగా ఇంకెంత ఉన్నాయో అన్న చర్చ నడుస్తోంది. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం అంటే.. నల్లధనం మళ్లీ పెరుగుతోందన్న సంకేతమేనా ?
బ్లాక్‌మనీ గురించి ఎప్పుడు చర్చ జరిగినా వినిపించే పేరు.. స్విస్ బ్యాంక్ ! స్విస్ బ్యాంకింగ్స్ నిబంధనలను ఆసరాగా చేసుకొని.. ఇక్కడి నల్ల డబ్బును… అక్కడికి తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయ్. ఐతే కొన్నాళ్లుగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు చెందిన పెట్టుబడులు, డిపాజిట్లు తగ్గుతూ వచ్చాయ్. ఐతే గతేడాది నుంచి సీన్ రివర్స్ అవుతూ వస్తోంది. భారతీయులకు చెందిన నిధులు భారీగా పెరుగుతూ కనిపించడం.. మళ్లీ బ్లాక్‌మనీపై చర్చకు దారి తీస్తోంది. నోట్ల రద్దుతో.. ఈ నల్లధనానికి అడ్డుకట్ట పడింది అనుకుంటే.. మళ్లీ ఇదేంటన్న డిస్కషన్ నడుస్తోంది.
స్విస్ బ్యాంక్‌ల్లో భారతీయుల పెట్టుబడులు, డిపాజిట్లు ఒక్క ఏడాదిలో గణనీయంగా పెరిగాయ్. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు.. ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. 2021లో భారతీయుల సంపద 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు.. అంటే మన కరెన్సీలో 30వేల 500 కోట్లకు చేరింది. ఇది గత 14ఏళ్లలో లెక్కలు చూస్తే ఇది గరిష్టం. సెక్యూరిటీలు, వాటికి సమాంతర సాధనాలు సహా కస్టమర్ల డిపాజిట్ల మూలంగా సంపదలో పెరుగుదల నమోదు అయింది. స్విస్ బ్యాంకుల్లో 2020లో భారతీయుల నిధుల మొత్తం 20వేల 700 కోట్లుగా ఉంది. ఏడాది వ్యవధిలో అది దాదాపు 50శాతం ఎగబాకి 30వేల 500 కోట్లకు చేరింది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల పెట్టుబడులు, నిధులకు సంబంధించి వరుసాగ రెండో సంవత్సరం పెరుగుదల నమోదు అయింది. మరోవైపు వరుసగా రెండేళ్ల పాటు తగ్గుముఖం పట్టిన భారతీయ కస్టమర్ల సేవింగ్స్ లేదా డిపాజిట్ అకౌంట్లలోని నగదు ఏడేళ్ల గరిష్ఠానికి చేరి… 2021లో 4వేల 800 కోట్లకు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. అప్పటినుంచి ఏటా తగ్గుముఖం పడుతూ వచ్చింది. 2011, 2013, 2017, 2020లో మాత్రం స్వల్ప వృద్ధి నమోదైంది. 2021లో ఏకంగా 50 శాతం పెరగడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.
స్విట్జర్లాండ్‌లోని వివిధ బ్యాంకులు అక్కడి నేషనల్ బ్యాంకుకు ఇచ్చిన అధికారిక వివరాల ప్రకారమే… ఈ గణాంకాలను విడుదల చేస్తారు. స్విస్ బ్యాంకుల్లో ఉండే సొమ్మంతా నల్లధనం అని ప్రచారంలో ఉంది. ఐతే తాజాగా విడుదల చేసిన లెక్కల్లోని సొమ్మంతా నల్లధనం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇతర దేశాల్లోని సంస్థల పేరిట భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు డిపాజిట్ చేసిన సొమ్ము కూడా దీని పరిధిలోకి రాదు. అత్యధికంగా స్విస్ బ్యాంకుల్లో యూకే దేశస్థులకు నిధులు ఉన్నాయి. అమెరికా రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంకాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కేమన్ ఐలాండ్స్, సైప్రస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 44వ స్థానంలో ఉంది.
యూకే అత్యధికంగా స్విస్ బ్యాంకుల్లో 379 బిలియన్ల స్విస్ ఫ్రాంక్ డిపాజిట్లను కలిగి ఉంది. దీని తర్వాత అమెరికా ఖాతాదారులకు 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు ఉన్నాయ్ 100 బిలియన్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన క్లయింట్‌ల జాబితాలో అమెరికా, యూకే దేశాలను మాత్రమే చేర్చడం జరిగింది. బ్రిక్స్ కూటమి దేశాల్లో రష్యా 15వ స్థానంలో… చైనా 24వ స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ దేశీయుల సంపద 712 మిలియన్ స్విస్ ఫ్రాంకులు, బంగ్లాదేశీయుల సంపద 872 మిలియన్ స్విస్ ఫ్రాంకులుగా నమోదయింది. కాగా స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో కస్టమర్ డిపాజిట్లు… 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయ్. ఇన్‌స్టిట్యూషన్స్ సహా ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ దాదాపు 1.5 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు చేరాయి.
1Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..
2Anand Mahindra: హైదరాబాద్‌లో రేసింగ్.. అధికారికంగానే
3Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
4Karnataka Police : కారణం చెప్పకుండా.. సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకం
5Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
6Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..
7Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాకరే రాజీనామా మాకు సంతోషాన్నివ్వలేదు – రెబల్ ఎమ్మెల్యే
8Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??
9Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..
10Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!