Foreign Minister Jaishankar: పాకిస్థాన్‌‌కు భారత్ సాయం చేస్తుందా? విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారంటే..

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మార్గాన్ని కనుగొనాలని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

Foreign Minister Jaishankar: పాకిస్థాన్‌‌కు భారత్ సాయం చేస్తుందా? విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారంటే..

Foreign Minister Jaishankar

Foreign Minister Jaishankar: పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ఆ దేశం మీడియా కథనాల ప్రకారం.. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు మూడు బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ మొత్తం 15 రోజుల దిగుమతికి సరిపోతుంది. అయితే, అంతకుముందు మరో పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం విధితమే. ఆ సమయంలో భారత్ గతఏడాది శ్రీలంకకు 4.5 బిలియన్ల యూఎస్ డాలర్లు ఆర్థిక సాయాన్ని అందించింది. అంతేకాక శ్రీలంకకు అన్ని విధాల సహాయ సహకారాలు భారత దేశం అందించింది.

Pakistan: పాకిస్తాన్‭లో రికార్డ్ స్థాయికి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఒక్క లీటర్ ఎంతో తెలుసా?

తాజాగా వార్త సంస్థ ఏఎన్ఐ‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ భవిష్యత్తు దాని సొంత చర్యలు, ఎన్నికల ద్వారా నిర్ణయించబడుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనేది పాకిస్థాన్ పై ఆధారపడి ఉందని అన్నారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సహాయం చేసిందని, భారత్ – శ్రీలంక మధ్య బంధం పాకిస్థాన్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైందని జైశంకర్ స్పష్టం చేశారు.

Pakistan Crisis: పాక్‌లో కిలో బియ్యం ధర ఎంతో తెలుసా..? ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ..

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మార్గాన్ని కనుగొనాలని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని, దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో పొరుగు దేశాలకు సహాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు.