Aditi Singh Microsoft : మైక్రోసాఫ్ట్ నుంచి రూ.22లక్షలు గెలిచిన 20ఏళ్ల భారతీయ యువతి

ఆమె వయసు 20ఏళ్లే. అయితేనేమీ అపారమైన టాలెంట్ ఆమె సొంతం. ఆ యువతి ప్రతిభ ఏ పాటిదంటే ఏకంగా ఐటీ దిగ్గజాన్నే మెప్పించింది. ఆ యువతి టాలెంట్ కు ఫిదా అయిన మైక్రోసాఫ్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు ఏకంగా రూ.22లక్షలు బహుమతిగా ఇచ్చింది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏం గుర్తించింది? అంటే..

Aditi Singh Microsoft : మైక్రోసాఫ్ట్ నుంచి రూ.22లక్షలు గెలిచిన 20ఏళ్ల భారతీయ యువతి

Aditi Singh Microsoft

Aditi Singh Microsoft : ఆమె వయసు 20ఏళ్లే. అయితేనేమీ అపారమైన టాలెంట్ ఆమె సొంతం. ఆ యువతి ప్రతిభ ఏ పాటిదంటే ఏకంగా ఐటీ దిగ్గజాన్నే మెప్పించింది. ఆ యువతి టాలెంట్ కు ఫిదా అయిన మైక్రోసాఫ్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు ఏకంగా రూ.22లక్షలు బహుమతిగా ఇచ్చింది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏం గుర్తించింది? అంటే..

సాఫ్ట్ వేర్ కంపెనీలు, టెక్ సంస్థలు తమ ఉత్పత్తుల్లోని లోపాలను గుర్తించే వారికి పెద్దఎత్తున ప్రోత్సాహక బహుమతులను అందిస్తుంటాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఓ భారత యువతికి భారీగా నజరానా అందించింది. తన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్ లో బగ్ ను గుర్తించిన అదితి సింగ్ (20) అనే యువతికి రూ.22 లక్షలు ఇచ్చింది. అదితి సింగ్ ఓ ఎథికల్ హ్యాకర్. అజ్యూర్ క్లౌడ్ సిస్టమ్ లోని రిమోట్ కోడ్ విభాగంలో ఉన్న లోపాన్ని కనుగొంది.

అదితి స్వస్థలం ఢిల్లీ. వైద్య విద్య అభ్యసించాలన్నది ఆమె కల. కానీ మెడికల్ ఎంట్రెన్సులో మెరుగైన ర్యాంకు రాకపోవడంతో ఆమె ఎథికల్ హ్యాకింగ్ వైపు మళ్లింది. కొద్దికాలంలోనే కోడ్ లాంగ్వేజీలపై పట్టు సాధించి, ప్రముఖ ఐటీ సంస్థల ఉత్పత్తుల్లోని బగ్ లను గుర్తించే స్థాయికి ఎదిగింది.

అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉన్న బగ్ ను రెండు నెలల కిందటే గుర్తించిన ఈ ఢిల్లీ అమ్మాయి వెంటనే మైక్రోసాఫ్ట్ కు నివేదించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఎంతో సులువుగా క్లౌడ్ వ్యవస్థల్లోకి చొరబడగలరని అదితి వెల్లడించింది. ఈ లోపాన్ని కాస్త ఆలస్యంగానైనా నిర్ధారించుకున్న మైక్రోసాఫ్ట్… ఆపై అదితికి భారీ బహుమతి అందించింది.

అదితి ఇప్పటివరకు అనేక బగ్ లను గుర్తించింది. పేటీఎం, టిక్ టాక్, ఫేస్ బుక్, హెచ్ పీ, మొజిల్లా వంటి కంపెనీల ఉత్పత్తుల్లో లోపాలను కనుగొని, వాటిని ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, అన్నింట్లోకి మైక్రోసాఫ్ట్ నుంచి దక్కిన బహుమతే అతి పెద్ద మొత్తం అని అదితి వెల్లడించింది. కాగా, ఇటీవలే మన దేశానికే చెందిన 21ఏళ్ల కుర్రాడు(మయూర్ ఫర్తడే) ఇన్ స్టాగ్రామ్ లో బగ్ కనిపెట్టి ఫేస్ బుక్ నుంచి ఏకంగా రూ.22లక్షలు గెల్చుకున్న సంగతి తెలిసిందే.