Gold Rate: రూ.370 వరకూ మళ్లీ పెరిగిన బంగారం ధర..

మూడ్రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఆదివారం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, వడ్డీ రేటు బంగారం ధరలపై ప్రభావం..

Gold Rate: రూ.370 వరకూ మళ్లీ పెరిగిన బంగారం ధర..

Gold Rates Today In Hyderabad

Gold Rate: మూడ్రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఆదివారం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, వడ్డీ రేటు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. దేశవ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై 370 రూపాయల వరకూ పెరిగింది. వివిధ నగరాల్లో బంగారం ధరల పెరుగుదల ఇలా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో
22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 47వేల 310 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 490 రూపాయలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 310 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 310 రూపాయలు
చెన్నైలో
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 240 అయితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 350 రూపాయలు
కోల్‌కతాలో
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 7 వందలు
బెంగళూరులో
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 50 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలు
కేరళలో
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 50 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలు

…………………………………: 29వ తేదీ వరకు ఆ రెండు జిల్లాల్లో వర్షాలు

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ధర చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49 వేల 150 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.