Indian Gooseberry : ఉసిరి సాగు…యాజమాన్యపద్దతులు

ఉసిరిలో పిండి పురుగు తాకిడి ఉంటుంది. ఈ పురుగులు ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ వరకు మొక్కలపై దాడి చేస్తాయి. ఈ పురుగులు నివారణకు మలాధియాన్ 2 మీ.లీ. ఒక నీటికి కలిపి పిచికారి చేయాలి.

10TV Telugu News

Indian Gooseberry : ఉసిరిని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చు. ఈ మొక్కలు దాదాపు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఉసిరి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి 2 నుండి 8 మిల్లీమీటర్లు పరిమాణం కలిగి ఉంటాయి. ఉసిరి కాయలు గుండ్రంగా ఉండి లేత ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ రంగులో నిలువు చారలు కలిగి ఉంటాయి. ఉసిరి పంట భారత దేశములో అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు. ఉసిరిని మందుల పరిశ్రమల్లోను, ఆయుర్వేదం మరియూ పచ్చళ్ళ లో ఉపయోగిస్తారు.

ఉసిరిలో ఉండే అనేక రకాల విటమిన్లు, ఇతర పోషకాలు, గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిల్లెంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి అధికంగా ఉంటాయి. దీనిని వివిధ రకాల వంటలు చేసుకోవడంతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ అధికంగా ఉపయోగిస్తారు. ఉసిరిలో పుష్కలంగా ఉంటే సీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.వివిధ రకాల చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ఉసిరిని సాగుకోసం నేలలో 60 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకోవాలి. ఇందులో 200 గ్రాముల నత్రజని ఎరువులు కలిపి గుంతల్లో వేసుకోవాలి. నర్సరీలను నుంచి అధిగ దిగుబడిని ఇచ్చే ఉసిరి మొక్కలను తీసుకుని నాటుకోవాలి. అనంతరం మొక్కలకు నీరు పెట్టాలి. ఒక ఎకరం పొలంలో 160కి పైగా మొక్కలునాటుకోవచ్చు. జూన్ జులై కాలంలో నాటుకుంటే మొక్కల పెరుగుదల, నాటుకోవడం మంచిగా ఉంటుంది. మొక్కల పెరుగుదలకు అనుగుణంగా సేంద్రీయ ఎరువులతోపాటు కృత్రిమ ఎరువులను అందించాలి.

మొక్కలు నాటిన మూడు సంవత్సరాలకు కాపును అందిస్తాయి. ప్రవర్థనం చేసిన కొన్ని రకాలు అంతకంటే ముందుగానే కాపును అందిస్తాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఉసిరికాయలు కొతకు వస్తాయి. ఈ సమయంలో కాయలకు తెగులు సోకకుండా మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.అంటుకట్టడం, కొత్తగా అభివృద్ధి చేసిన రకాలతో తక్కువ ఎత్తు పెరిగి.. అధిక దిగుబడిని ఇచ్చే ఉసిరి మొక్కలు రకాలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఉసిరిని సాగు చేయడానికి ఎర్ర నేలలు, లోమ్ నెలలు, దుబ్బ నెలలు, ఇసుక నేలలు సైతం అనుకూలంగా ఉంటాయి. భూమిలో పీహెచ్ విలువ 7 నుంచి 9.5 శాతం వరకు ఉండే అన్ని నేలలలో ఉసిరిని సాగు చేయవచ్చు.

ఉసిరి సాగులో అందుబాటులో ఉన్న రకాలు…

చకియా రకం ఇది గుబురుగా పెరిగి అధిక దిగుబడి నిస్తుంది. ఒకొక్క ఉసిరి కాయ బరువు సుమారుగా 39 గ్రాములు ఉంటుంది. బెనారసి రకం ఇది ఒక మోస్తరు ఎత్తు పెరిగి మంచి దిగిబడి నిస్తుంది. ఒకొక్క ఉసిరి కాయ బరువు సుమారుగా 50 గ్రా.వరకు ఉంటుంది. ఫ్రాన్సిస్ రకం ఇది నిటారుగా ఎత్తుగా పెరిగి ప్రతి సంవత్సరం కాపు వస్తుంది. ఒకొక్క ఉసిరి కాయ బరువు 62గ్రా వరకకు ఉంటుంది. భావాని సాగర్‌ రకం. ఈ రకం అధిక దిగుబడినిస్తుంది. ఉసిరి కాయ బరువు సుమారుగా 30 గ్రాముల వరకు ఉంటుంది. కాంచన్‌ రకం ఇది ఫజియాబాద్‌ నుండి విడుదల చేయబడిన ఉసిరి రకము. అధిక దిగుబడినిస్తుంది. కాయ బరువు సుమారుగా 38 గ్రాముల వరకు ఉంటుంది. కృష్ణ రకం..ఈ రకం అధిక దిగుబడినిస్తుంది. ఒక్కోక కాయ బరువు సుమారుగా 38గ్రాముల వరకు ఉంటుంది. అన్నంద్ 1,2రకాలు అధిక దిబడినిస్తాయి. ఒక్కో ఉసిరికాయ బరువు సుమారుగా 39 గ్రాములవరకు ఉంటాయి. యన్.ఎ7 రకం అధిక దిగుబడి నిస్తుంది. కాయ బరువు సుమారుగా 40 గ్రాముల వరకు ఉంటుంది.

ఉసిరి సాగులో సస్యరక్షణ…

ఉసిరిలో పిండి పురుగు తాకిడి ఉంటుంది. ఈ పురుగులు ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ వరకు మొక్కలపై దాడి చేస్తాయి. ఈ పురుగులు నివారణకు మలాధియాన్ 2 మీ.లీ. ఒక నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుచుట్టు పురుగు ఇది పత్ర హరితాన్ని తినడం వల్ల కిరణ జన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. బెరడు పురుగు ఇది చెట్ల మొదల్లో, కొమ్మలపై బెరడును తిని మొక్క ఎదగకుండా చేస్తాయి. ఈ పురుగులు విసర్జించిన పదార్ధాన్ని తీసి వేసి రంద్రాలలో రెండు చుక్కలు కిరోసిన్ వేయటం ద్వారా నివారించుకోవచ్చు. దీని నివారణకు గాను, 2 మీ.లీ. మలాధియాన్ ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

గాల్ చిడ పురుగు ఇది వర్షాకాలంలో ఉసిరి కొమ్మల చివరి భాగంలో పిల్ల పురుగులు రంధ్రాలు చేయడం వల్ల కొమ్మల పెరుగుదల తగ్గిపోతుంది. దీని నివారణకు గాను, 2 మి.లీ. రొగార్ ను నీటితో కలిపి పిచికారి చేయాలి. రస్ట్ తెగులు ఇది వస్తే ఆకుల మీద గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తరువాత ఉసిరి కాయల మీద సైతం ఇదే తరహా మచ్చలు వస్తాయి. ఆకుతుప్ప తెగులు ఇది జులై నుండి ఆగస్ట్ నెలవరకు కనిపిస్తుంది. 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు ఒక శాతం బోరోమిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఉసిరి నాటిన మూడువ సంవత్సరం నుండి దిగుబడి రావటం ప్రారంభమౌతుంది. ప్రతిఏటా సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో పంట చేతికి వస్తుంది. తొలికాపు 1500కిలోలు, తరువాత నుండి దిగుబడి పెరిగే అవకాశం ఉంది.