India Porn Ban: 67అశ్లీల వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్‌లకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

కేంద్రం  67 అశ్లీల వెబ్‌సైట్‌ల‌పై నిషేధం విధించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) అశ్లీల కంటెంట్‌తో కూడిన 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

India Porn Ban: 67అశ్లీల వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్‌లకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

pornographic websites

India Porn Ban: కేంద్రం  67 అశ్లీల వెబ్‌సైట్‌ల‌పై నిషేధం విధించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) అశ్లీల కంటెంట్‌తో కూడిన 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పూణె కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని, ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా నాలుగు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని టెలికాం శాఖ ఇంటర్నెట్ కంపెనీలను కోరింది.

RBI Hikes Repo Rate: రుణగ్రహీతలకు షాక్.. మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ..

ప్రభుత్వం అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించడం ఇదే మొదటిసారి కాదు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం 850 అశ్లీల కంటెంట్ సంబంధిత వెబ్ సైట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిషేధం వెనుక కారణాన్ని DOT ఇంకా వెల్లడించలేదు. వీటిని తక్షణమే నిషేధించాలని ఆశాఖ ఇంటర్నెట్ కంపెనీలను కోరింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారతదేశంలోని 67 అశ్లీల వెబ్‌సైట్లు/యూఆర్ఎల్ లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన ట్వీట్ లో పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నూతన ఐటీ రూల్స్ 2021 ప్రకారం వెబ్‌సైట్‌లను నిషేధించాలని ప్రభుత్వం తెలిపింది. నూతన ఐటీ నియమం ప్రకారం.. వ్యక్తిని పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నంగా చూపించే, ఏదైనా లైంగిక చర్యలో పాల్గొన్న వ్యక్తిని చూపించే కంటెంట్ ను నిషేధిస్తుంది.