Indian Govt.: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసిన కేంద్రం

"మేక్ ఇన్ ఇండియా" తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసింది.

Indian Govt.: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసిన కేంద్రం

Defence

Indian Govt.:భారత రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసింది. “మేక్ ఇన్ ఇండియా” తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. క్షిపణుల దిగుమతుల పై భారత్ – విదేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న ఒప్పందాలపై శుక్రవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రక్షణశాఖ అధికారులు సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో.. భారత్ తో.. విదేశీ తయారీ సంస్థలకు మధ్యనున్న పలు పాక్షిక ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. స్వల్ప-శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణుల ఒప్పందాలు మరియు భారత తీర రక్షణ దళానికి చెందిన 14 హెలికాప్టర్ల కొనుగోలుకు టెండర్లను రద్దు చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also read: Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

కాగా క్షిపణుల దిగుమతి తదితర ఒప్పందాలపై గత ఏడాది ప్రధాని మోదీ అద్యక్షతన ఒక సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆ సమయంలో త్రివిధ దళాధిపతి, దివంగత జనరల్ బిపిన్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. భారత్ లో రక్షణ పరికరాల తయారీని చేపట్టి, ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసేందుకే.. ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇవే కాక భారత నేవీ కోసం మరో ఆరు P-8I నిఘా విమానాలు మరియు క్లబ్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు ఒప్పందాలను సైతం రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. భారత ఆర్మీ కోసం రష్యకు చెందిన VSHORAD (చాలా తక్కువ-శ్రేణి వైమానిక రక్షణ) క్షిపణుల దిగుమతులను సైతం రద్దు చేసుకునేందుకు ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Virat Kohli: పూజారా, రహానెల భవిష్యత్ గురించి ఆలోచించడం నా పని కాదు – కోహ్లీ