బూట్ పాలిష్‌వాలా.. ఇండియన్ ఐడిల్ 11 వాలా

బూట్ పాలిష్‌వాలా.. ఇండియన్ ఐడిల్ 11 వాలా

ఇండియన్ ఐడల్ 11 విన్నర్‌గా బతిందాకు చెందిన సన్నీ హిందూస్థానీ నిలిచాడు. సీజన్‌లో నుశ్రాత్ అలీ ఖాన్ పాటలను దాదాపు అదే రేంజ్‌లో పాడాడు. ట్రోఫీతో పాటు T-సిరీస్ రూ.25లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు సన్నీ. అఫ్రీన్.. అఫ్రీన్ పాటతో ఆడిషన్ రోజు నుంచి జడ్జిలను మెస్మరైజ్ చేస్తూ వచ్చిన సన్నీకి ఆనంద్ మహీంద్రా కూడా ఫ్యాన్ అయిపోయాడు. ఆడిషన్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు. 

ఫినాలె నైట్.. సన్నీ చాలా పాటలు పాడాడు. మేరే రష్కే ఖమర్, హల్కా హల్కా సరూర్ పాటలు కిరాక్ పుట్టించాయి. ఈ స్థాయికి రావడానికి సన్నీ పడ్డ కష్టాన్ని స్క్రీన్‌పై చూసి ఆయుష్‌మాన్ కంటతడి పెట్టుకున్నారు. ‘ఈ స్థాయికి రావడానికి నేను పడ్డ కష్టం అందరికంటే ఎక్కువ అని ఫీలయ్యేవాడిని. ఇతనితో పోల్చుకుంటే  అన్నీ చిన్నవే అనిపిస్తుంది. ఇంత టాలెంట్‌తో ఎక్కడి నుంచి వచ్చాడు. అతని తల్లి చాలా గొప్పది’ అంటూ పొగడ్తలు కురిపించాడు. 

ఫస్ట్ రన్నరప్ సాధించిన రోహిత్ రౌత్, సెకండ్ రన్నరప్ అంకోనా ముఖర్జీలకు చెరో ఐదు లక్షలు వచ్చాయి. 4, 5 స్థానాల్లో నిలిచిన రిధమ్ కళ్యాన్, అద్రిజ్ ఘోష్‌లకు చెరో రూ.3లక్షల వచ్చాయి. ఫైనల్ కు చేరిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల చెక్కును అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The #IndianIdol11 title goes to @sunny_hindustaniofficial Join us in Congratulating him ??

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి ఊహ తెలసినప్పటి నుంచి రైల్వే స్టేషన్లో బూట్ పాలిష్ చేసి డబ్బులు సంపాదించేవాడు. పిల్లల్ని పోషించడానికి వాళ్లమ్మ భిక్షమెత్తుకునేదని గుర్తు చేసుకున్నాడు. పంజాబ్ లోని భటిండాకు చెందిన 21ఏళ్ల సన్నీ.. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. పాకిస్తాన్ లోని ప్రముఖగాయకుడు నుశ్రాత్ ఫతే అలీఖాన్ ప్రేరణతో పాడటం మొదలుపెట్టాడు. తన తల్లి బెలూన్లు అమ్ముతుంటుంది.