MH 60 Romeo Helicopter : భారత నావికాదళంలోకి రోమియోలొచ్చేశాయ్‌.. ప్రత్యేకతలివే!

సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్.. ఈ నేపథ్యంలోనే అధునాతన టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లను కొనుగోలు చేస్తుంది. మరోవైపు యాంటీ డ్రోన్ సిస్టం అభివృద్ధి చేసేందుకు చకచకా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశానికి చెందిన టాటా సంస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది.

MH 60 Romeo Helicopter : భారత నావికాదళంలోకి రోమియోలొచ్చేశాయ్‌..  ప్రత్యేకతలివే!

Mh 60 Romeo Helicopter

MH 60 Romeo Helicopter : సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్.. ఈ నేపథ్యంలోనే అధునాతన టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లను కొనుగోలు చేస్తుంది. మరోవైపు యాంటీ డ్రోన్ సిస్టం అభివృద్ధి చేసేందుకు చకచకా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశానికి చెందిన టాటా సంస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. దీనిని కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం, అఫ్ఘాన్ లో తాలిబన్లు పెట్రేగిపోతుండటం, చైనా, పాకిస్తాన్ లు కయ్యానికి కాలుదువ్వుతుండటంతో భారత్ వీటన్నింటి ఒకేసారి ఎదురుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది.

యుద్ధం అనివార్యమైతే శత్రువును ఎదుర్కోడానికి కావలసిన ఆయుధాలను, యాంటీ డ్రోన్ సిస్టమ్.. యాంటీ మిసైల్ సిస్టమ్ ను రూపొందిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 18000 కోట్ల రూపాయలతో 24 ఎంహెచ్‌–60ఆర్‌ రోమియో హెలికాప్టర్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వీటిలో రెండు హెలికాప్టర్లను భారత్ కు అందించింది అమెరికా ఆయుధాల తయారి కంపెనీ లాక్‌హీడ్‌.. దీంతో దేశ నావికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది.

అగ్రరాజ్యంలో శుక్రవారం శాన్‌డియోగోలో నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రెండింటిని భారత్‌కు లాంఛనంగా అప్పగించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తారాంజిత్‌ సింగ్‌ సాంధు, అమెరికా నేవల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌ కెన్నెత్‌ వైట్‌సెల్, భారత్‌ కమాండర్‌ రవ్‌నీత్‌ సింగ్, హెలికాఫ్టర్లు తయారు చేసిన లాక్‌హీడ్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు గురించి చెప్పాలి అంటే..

* వీటిని యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్, యాంటీ సర్‌ఫేస్‌ ఆయుధంగా కూడా వాడవచ్చు. అంటే త్రివిధ బలగాల్లోనూ వీటిని వినియోగించుకోవచ్చు.

*సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల కదలికల్ని పసిగట్టి దాడులు చేయగలదు

* జలాంతర్గాముల్ని కూడా వెంటాడి ధ్వంసం చేసేలా డిజైన్‌ని రూపొందించారు

* సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు

* గంటకి 267కి.మీ. వేగంతో దూసుకుపోతుందిప్రకృతి విపత్తుల సమయాల్లో ఈ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవచ్చు

* సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు