గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఒక్కరోజులోనే డెలివరీ!

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఒక్కరోజులోనే డెలివరీ!

Indian Oil plans Tatkal LPG Seva : గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వినియోగదారులకు గుడ్ న్యూస్. బుక్ చేసుకున్న తర్వాత..గ్యాస్ ఎప్పుడెస్తుందోనన్న బెంగ తీరనుంది. కేవలం ఒక్క రోజులోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్న వారు…అయిపోయిన..తర్వాత..మళ్లీ సిలిండర్ వచ్చేంత వరకు పలు ఇబ్బందులు పడుతుంటారు. కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తత్కాల్ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకరావాలని యోచిస్తోంది. ఇందుకు తత్కాల్ ఎల్ పీజీ సేవలను ఆవిష్కరించనుంది. కస్టమర్లు బుక్ చేసిన రోజునే గ్యాస్ సిలిండర్ రానుంది.

ఈ సేవల కింద కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత..30 నుంచి 45 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రయత్నిస్తామని ఐఓసీఎల్ టాప్ మేనేజ్ మెంట్ తెలిపింది. కానీ..ఈ సేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో మాత్రం ఖచ్చితంగా తెలియరావడం లేదు. అయితే..ఫిబ్రవరి 01వ తేదీ కల్లా..అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ తన కస్టమర్లకు ఇండేన్ గ్యాస్ రూపంలో ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేవలు అందుబాటులోకి వస్తే కొంతమందికి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి.