Gas Cylinder: బుక్ చేసిన 2 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. "ఇండియన్ ఆయిల్" తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Gas Cylinder: ఆర్డర్ చేస్తే అరగంటలో డెలివరీ వస్తున్న ప్రస్తుత తరుణంలో కొన్ని రవాణా సేవలు మాత్రం వేగాన్ని పుంజుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ పరమైన సేవలు ఏళ్లకేళ్లుగా పరిహసనంగా మారిపోయాయి. ఇలాంటి ధోరణి నుంచి బయటపడేలా ఇప్పుడిప్పుడే ప్రభుత్వరంగ సంస్థలు తమ వైఖరి మార్చుకుంటున్నాయి. టెలిఫోన్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ వంటి సౌకర్యలను వినియోగదారులు అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ కూడా ఈ జాబితాలో చేరింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ “ఇండియన్ ఆయిల్” తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Also read” Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

తమ తత్కాల్ సేవలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ వస్తుంది. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఐవీఆర్ఎస్, వెబ్‌సైట్ లేదా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తత్కాల్ సేవకు గానూ వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లో ఎంపిక చేయబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.

Also read: Corona Update: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు