అభినందన్ వచ్చేశాడు : సరిహద్దుల్లో ఘన స్వాగతం

  • Published By: sreehari ,Published On : March 1, 2019 / 02:47 PM IST
అభినందన్ వచ్చేశాడు : సరిహద్దుల్లో ఘన స్వాగతం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ ఇండియాకి వచ్చేశాడు. రాత్రి 09.25 నిమిషాలకు భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టాడు. పాక్ – భారత్ సరిహద్దుల్లోని వాఘా దగ్గర  లక్షల మంది ప్రజలు జయహో భారత్. భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అభినందన్ కు స్వాగతం పలికారు. సలామ్ సైనికుడా అంటూ సెల్యూట్ చేశారు. భారత్ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే.. అభినందన్.. అభినందన్ అంటూ లక్షల గొంతులు ఒక్కసారి వెలిగెత్తాయి. వాఘా సరిహద్దులు.. జై భారత్ నినాదాలతో దద్ధరిల్లింది. 

ఉప్పొంగిన మనస్సులు..  పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి.. వేటాడి కూల్చేశాడు. ఆ తర్వాత విమానం కూలిపోతుండగా ప్యారాచూట్ సాయంతో దూకేశాడు. పాక్ దేశంలో పడిపోయాడు. పాక్ గడ్డపై తొడగొట్టి హీరోయిజానికి అభినందన్ వర్థమాన్ కొత్త అర్థం చెప్పాడు. దేశం మీసం మెలేశాడు. శత్రువుల చేతుల్లో చిక్కిన ఎంతమాత్రం ఆయన కళ్లలో బెరుకు కనిపించలేదు. ప్రతీ భారతీయుడిలో రియల్ హీరోగా స్పూర్తి నింపాడు. 

పాక్ బందీగా ఉన్న అభినందన్ ను విడుదల చేయాలంటూ వచ్చిన ఒత్తిళ్లతో పాకిస్తాన్ దిగివచ్చింది. 48 గంటల్లోనే విడుదలకు అంగీకారం తెలిపింది. భారత వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింత సందర్భంగా వాఘా సరిహద్దులో ఏర్పాటు చేసిన బీటింగ్ రిట్రీట్ రద్దు చేశారు. 

వాఘా సరిహద్దు దగ్గర పండుగ వాతావరణం
పాక్ బందీగా చిక్కిన తర్వాత భారత పైలట్ అభినందన్ ను శుక్రవారం (మార్చి 1, 2019) భారత్ కు అప్పగిస్తున్న తరుణంలో వాఘా సరిహద్దు దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. అభినందన్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పందుకు భారీ సంఖ్యలో భారత ప్రజలు వాఘా సరిహద్దు ప్రాంతానికి తరలివచ్చారు. అభినందన్ తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుంచి  వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.

వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో వాఘా సరిహద్దు హోరెత్తుతోంది. వాఘా సరిహద్దు దగ్గరకు వింగ్ కమాండర్ అభినందన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్ నుంచి అభినందన్ ను పాక్ వాహనాలు తీసుకొచ్చాయి. పాకిస్థాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది. వాఘా బార్డర్ దగ్గర భద్రత బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. వాఘా సరిహద్దు దగ్గర ఐఎఎఫ్ అధికారులకు అభినందన్ ను పాక్ అప్పగించింది. సరిహద్దు దాటి భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టాడు. అభినందన్ కు ఎయిర్ వైస్ మార్షల్స్ ప్రభాకరన్, కపూర్ ఘన స్వాగతం పలికారు. 

అభినందన్ కు వైద్య పరీక్షలు
పాకిస్థాన్ సైనికులు అభినందన్ ను భారత్ కు అప్పగించిన అనంతరం అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అనంతరం అభినందన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించనున్నారు. డీ బ్రీఫింగ్ ప్రాసెస్ లో భాగంగా వర్థమాన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. పాక్‌ నిర్బంధించిన తర్వాత జరిగిన పరిణామాలపై వింగ్ కమాండర్ ను ప్రశ్నించనున్నారు. పాకిస్తాన్‌ వ్యవహరించిన తీరు, అడిగిన ప్రశ్నలను సేకరించనున్నారు. అభినందన్ చెప్పే విషయాలను సేకరించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.