India Britain Relations: రిషి సునక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. కీలక అంశాలపై ప్రస్తావన

బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్‌తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్‌‌పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.

India Britain Relations: రిషి సునక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. కీలక అంశాలపై ప్రస్తావన

Rishi Sunak, Narendra modi

India Britain Relations: ప్రధాని నరేంద్ర మోదీ  (PM Narendra modi) బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ (Britain Rishi Sunak) తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రధానుల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చాయి.  భారత్‌లో  ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన వ్యక్తుల అప్పగింత, లండన్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) కార్యాలయంపై దాడితో సహా అనేక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. భారత్ వ్యతిరేక శక్తుల విషయంలో గట్టి చర్యలు చేపట్టాలని రిషి సునాక్‌ను ప్రధాని మోదీ కోరారు. ఇటీవల ఖలిస్తాన్ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ (Amritpal Singh) పై పంజాబ్ పోలీసులు భారీ అణిచివేత ప్రారంభించిన మరుసటి రోజు (మార్చి 19న) లండన్‌  (London) లోని భారత్ హై కమిషన్ కార్యాలయంపైన వేర్పాటువాద ఖలిస్తానీ జెండాలు చేతబూనిన కొందరు దాడికి దిగారు. కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని నిరసనకారుల బృందం తొలగించింది. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించగా.. దీంతో కార్యాలయం వద్ద బ్రిటన్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.

PM Modi : బందీపూర్ టైగర్ సఫారీని సందర్శించిన మోదీ..

బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్‌‌పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. కార్యాలయం వద్ద భద్రత విషయంలో సునక్ హామీ ఇచ్చినట్లు  అధికారంగా  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. పరస్పర ప్రయోజనదాయకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

అదేవిధంగా బ్రిటన్ లో నివాసముంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వ్రజాల వ్యాపారి నీరవ్ మోడీలను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయంపై కూడా ఇరువురి ప్రధానుల మధ్య చర్చకు వచ్చింది. ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్లో ఉంటున్నవారిని మన దేశానికి అప్పగించే విషయంలో పురోగతిని గురించి ప్రధాని మోదీని రిషి సునక్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సెప్టెంబర్  నెలలో ఢిల్లీలో జరిగే జీ-20 సదస్సుకు హాజరుకావాల్సిందిగా సునాక్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.