Modi The Immortal : చైనాలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారో తెలుసా..? ఏకంగా ముద్దుపేరు పెట్టేశారు..
చైనీయులు భారత ప్రధాని మోదీ అంటే ఇష్టపడరని ఎక్కువ మంది అభిప్రాయం. వారి అభిప్రాయాలను విరుద్ధంగా అంతర్జాతీయ మ్యాగజీన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. చైనీయులుసైతం మోదీ అంటే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ ‘ద డిప్లొమాట్’ వెల్లడించింది. అంతేకాదు, మోదీకి ముద్దుపేరు కూడా పెట్టేశారట.

PM Modi
Modi The Immortal : ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం విధితమే. ఆయా దేశాల ప్రజలుసైతం భారత ప్రధాని మోదీ అంటే ఇష్టపడుతున్నారని ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. దాదాపు అన్ని దేశాలతో మోదీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, పొరుగుదేశమైన చైనీయులు మాత్రం మోదీపై విమర్శలు చేస్తారని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇటీవల సరిహద్దుల్లో యుద్ధం, చైనా యాప్‌లపై ఇండియాలో నిషేధం.. ఇలా పలు విషయాల్లో మోదీ కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో చైనీయులు మోదీ అంటే ఇష్టపడరని ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. వారి అభిప్రాయాలను విరుద్ధంగా అంతర్జాతీయ మ్యాగజీన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. చైనీయులుసైతం ప్రధాని మోదీ అంటే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ ‘ద డిప్లొమాట్’ వెల్లడించింది. చైనీయులు ప్రధాని మోదీని ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారని, ‘మోదీ లావోగ్జియన్’ అని ముద్దుపేరు కూడా పెట్టేశారని మ్యాగజీన్‌లో ప్రచురితమైన కథనం ద్వారా షుంషాన్ పేర్కొన్నాడు.
PM Modi Can Stop War: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మోదీకి ఉంది.. అమెరికా
లావోగ్జియన్ అంటే అసాధారణ సామర్థ్యం కలిగిన వృద్ధుడైన దివ్య పురుషుడు అని అర్థం. అయితే, షుంషాన్ 20ఏళ్ల నుంచి అంతర్జాతీయ మీడియా వార్తలను అందిస్తున్నాడట. అప్పటి నుంచి చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం ఆయన ఎప్పుడూ చూడలేదట. దీనినిబట్టి చూస్తే చైనాలో ప్రజల దృష్టిలో నరేంద్ర మోదీకి ఏ స్థాయిలో అభిమానం ఉందో అర్థంచేసుకోవచ్చని అని షుంషాన్ తన కథనంలో పేర్కొన్నాడు. షుంషాన్ ఈ కథనంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చైనా సోషల్ మీడియాలో ‘సైనా వీబో’ యాప్ విశేష ఆదరణ పొందింది. ఈ యాప్‌కు 58కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్‌లోని నెటిజన్ల అభిప్రాయాల ఆధారంగా షుంషాన్ ఈ కథనాన్ని రాసినట్లు తెలిపారు. ఈ యాప్‌లో నెటిజన్లు మోదీని చాలా భిన్నమైన వ్యక్తిగా చూస్తున్నారని, ఆయనకు అసాధారణ సామర్థ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారని చెప్పారు.
చైనా ట్విటర్‌కు పోటీగా సైనా వీబో యాప్ అందుబాటులో వచ్చింది. ఈ యాప్‌లో 2015లో ప్రధాని నరేంద్ర మోదీకూడా చేరారు. ఆయనకు 2.44లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, భారత్‌లో చైనాకు సంబంధించిన యాప్‌ల వినియోగాన్ని బ్యాన్ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో 2020 జులై నెలలో మోదీ ఆ యాప్ నుంచి తన ఖాతాను తొలగించేశారు.