Indian Railways: భారత్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ లకు నేరుగా రైలు సేవలు

దేశాల మధ్య రైల్వే లైన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా "భౌగోళికంగా దక్షిణాసియా దేశాలు" ఎంతో దగ్గరౌతున్నాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు.

Indian Railways: భారత్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ లకు నేరుగా రైలు సేవలు

Indian Railways

Indian Railways: దేశాల మధ్య రైల్వే లైన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా “భౌగోళికంగా దక్షిణాసియా దేశాలు” ఎంతో దగ్గరౌతున్నాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు.  విదేశాంగ విధాన ప్రాధాన్యతలన్నింటిలో భారత్ తన పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని శ్రింగ్లా అన్నారు. ఇటీవల ఓ విద్యాసంస్థ సమావేశం సందర్భంగా విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ భారత్ నుంచి త్వరలో నేపాల్‌ కు రెండు రైల్వే లైన్లు, బంగ్లాదేశ్‌తో ఆరు రైలు నెట్‌వర్క్‌లు అనుసంధానించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా దేశాల్లోని అంతర్గత ప్రాంతాలతోనూ రవాణా సౌకర్యాన్ని పెంపొందించే విషయమై విస్తృతంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు శ్రింగ్లా వివరించారు.

Also read:UP Election : అఖిలేశ్ విఫలం కావడానికి కారణాలు ఏంటీ ?

పొరుగు దేశంలోని వివిధ ప్రాంతాలలో రోడ్డు, నీటి మార్గం, రైలు మరియు విమానాల ద్వారా “మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ”ని క్రమంగా మెరుగుపరుచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, భారత్ – బంగ్లాదేశ్ మధ్య పలు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో నేపాల్, భూటాన్ మరియు మాల్దీవులకు వెళ్లే భారతీయులకు వీసాలు అవసరం లేదు. శ్రీలంక మరియు యాంగాన్‌(మయాన్మార్)లోని భారత దౌత్య కార్యాలయాల నుంచి వీసా జారీలలో పెరుగుదల కనిపించినట్లు శ్రింగ్లా పేర్కొన్నారు. ఇక రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు పొరుగు దేశాల్లో ఇంధన రంగంపైనా భారత్ దృష్టి సారించిందని శ్రింగ్లా అన్నారు.

Also read: AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

ఇప్పటికే భారత్ నుంచి అధిక సామర్థ్యం గల కనెక్షన్‌ల ద్వారా విద్యుత్ గ్రిడ్.. నేపాల్, భూటాన్ బంగ్లాదేశ్‌లకు అనుసంధానించబడినట్లు శ్రింగ్లా పేర్కొన్నారు. పొరుగున ఉన్న దేశాలు భారత్‌కు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు. “ఈ దేశాలతో మన సంబంధాలు భాగస్వామ్య చరిత్ర మరియు సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. భారతదేశం మరియు దాని పొరుగు దేశాలు తీసుకున్న విధాన కార్యక్రమాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి” అని ఆయన అన్నారు.

Also read:Sensex Surge: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సానుకూలంగా స్టాక్ మార్కెట్