రైల్వే స్టేషన్లలో ఉర్దూ తొలగింపు…సంస్కృతంలోనే సైన్ బోర్డులు

ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇకపై ఉత్తరాఖండ్ లో రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంలపై హిందీ,ఇంగ్లీష్,సంస్కృతం బాషల్లోనే సైన్ బోర్డులు ఉంటాయి. ఇప్పటివరకు ఉన్న ఉర్దూని తొలగించనున్నారు.
రైల్వే స్టేషన్ పేర్లు హిందీ,ఇంగ్లీష్,రాష్ట్రంలోని రెండవ బాషతో ఉండాలన్న రైల్వే మాన్యువల్ లోని ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉన్నప్పటి నుంచి సైన్ బోర్డులు ఉర్దూలో ఉంచబడ్డాయని,ఉత్తరప్రదేశ్ లో ఉర్దూ రెండవ అధికార భాష కనుక అలా ఉంచబడ్డాయని,దీనిపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండవ బాషగా ఉన్న సంస్కృతంనే అక్కడి సైన్ బోర్డులపై ఉంచాలని,ఉర్దూని తొలగించాలని నార్తన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దీపక్ కుమార్ తెలిపారు. హిందీ మరియు సంస్కృతం ఒకే దేవనాగరి లిపిని ఉపయోగిస్తాయి కాబట్టి డెహ్రాడూన్ డెహ్రాడూనం, హరిద్వార్ హరిద్వారం మరియు రూర్కీ సంస్కృతంలో రూర్కీగా ఉంటుందని స్థానిక సంస్కృత టీచర్ తెలిపారు.
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి రమేష్ పోక్రియాల్ చెప్పారు. 2019లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఉత్తరాఖండ్ ని ఫాలో అయింది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా రెండవ అధికార భాషగా సంస్కృతం ఉంది.
మరోవైపు సంస్కృతం భాషను ప్రమోట్ చేయడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా గతేడాది అన్ని ప్రెస్ స్టేట్ మెంట్ లు సంస్కృతంలో కూడా జారీ చేయాలని ఆదేశించారు. అయితే యోగి ఆదేశాలు ఆదేశాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కేవలం రెండు ప్రెస్ నోట్లు మాత్రమే సంస్కృతంలో జారీ చేయబడ్డాయి.