Indian Railways : మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ కొరఢా..రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై వేటు..

రైల్వే శాఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పని సరిగా చేయని..అవినీతికి పాల్పడే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిపై వేటు పడుతోంది. వేటు అంటే ఏదో సస్పెన్షన్ కాదు. ఏకంగా శాశ్వతంగా ఇంటికే పంపించేస్తున్నారు.

Indian Railways :  మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ కొరఢా..రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై వేటు..

Indian Railways  'non-performer or corrupt official' every three days

Indian Railways : రైల్వే శాఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పని సరిగా చేయని ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిపై వేటు పడుతోంది. వేటు అంటే ఏదో సస్పెన్షన్ కాదు. ఏకంగా శాశ్వతంగా ఇంటికే పంపించేస్తున్నారు. వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ)తో ఇంటికి పంపించేస్తున్నారు. దీంతో రైల్వే ఉగ్యోగుల గుండెల్లో గుబులు కొనసాగుతోంది. రైల్వే శాఖలో మంత్రి అశ్విని వైష్ణవ్ 2021 నుంచి ఈ క్రమశిక్షణా చర్యలు కొనసాగిస్తున్నారు. పనితీరు సరిగా లేకపోయినా..అవినీతికి పాల్పడినా..ఏమాత్రం ఉపేక్షించకుండా వారికి వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపేస్తున్నారు. అలా ఇప్పటి వరకు 139 మంది ఉద్యోగులపై వీఆర్ఎస్ వేటు పడింది.

Indian railway ‘పైసా వసూల్’ రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకు 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్‌ఎస్‌ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఉద్యోగుల పనితీరుపై కఠినంగా ఉండాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. 2021 జులై నుంచి రైల్వే శాఖలో ప్రతి మూడు రోజులకు ఒక అవినీతిపరుడిని పంపించేశాం అని ఓ అధికారి తెలిపారు. దీంట్లో భాగంగానే తాజాగా బుధవారం (నవంబర్ 23,2022) కూడా ఇద్దరు సీనియర్‌ గ్రేడ్‌ అధికారులను ఉద్యోగం నుంచి తొలగించారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా.. రాంచీలో మరో అధికారి రూ.3లక్షలు తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారని రైల్వే వర్గాలు తెలిపాయి.

Indian Railways: ఇకపై రైల్వేలో మరో ఏసీ స్పెషల్ కోచ్

2021లో రైల్వే మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల పనితీరు విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. వాటిని ఏమాత్రం ఉపేక్షించకుండా అమలు చేస్తున్నారు. డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహించపోయినా అవినీతికి పాల్పడినా వేటు తప్పదని ముందే హెచ్చరించారు. కానీ ఇటువంటివి సాధారణమే..కొత్తగా వచ్చిన మంత్రులు ఇలా హెచ్చరించటం మామూలే అంటూ లైట్ తీసుకున్నవారిపై వేటు పడింది. కానీ మంత్రి అశ్వీని వైష్ణవ్ మాత్రం తనదైన శైలి మార్కు చూపిస్తున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించాని సహించేది లేదని తేల్చి చెప్పారు. లైట్ తీసుకుంటే వీఆర్‌ఎస్‌ తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్రమంత్రి పలుమార్లు ఉద్యోగులను హెచ్చరించారు. ఇక అవినీతికి పాల్పడే ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే పలువురు ఉద్యోగులపై వేటు పడింది. ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌, మెడికల్‌, స్టోర్స్‌, మెకానికల్‌ విభాగాల్లో ఈ కోతలు ఉన్నట్లు తెలుస్తోంది.