Indian Railways: ఇకపై రైల్వేలో మరో ఏసీ స్పెషల్ కోచ్

ఇండియన్ రైల్వేలో మరో కేటగిరీ తీసుకొచ్చే యోచనలో ఉంది మేనేజ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎకానమీ క్లాస్ ఏసీ 3టైర్ కోచెస్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కోచ్ లు ఏర్పాటు అయినంత త్వరలోనే సంబంధిత రైళ్లకు కేటాయిస్తారు.

Indian Railways: ఇకపై రైల్వేలో మరో ఏసీ స్పెషల్ కోచ్

Train Services

Indian Railways: ఇండియన్ రైల్వేలో మరో కేటగిరీ తీసుకొచ్చే యోచనలో ఉంది మేనేజ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎకానమీ క్లాస్ ఏసీ 3టైర్ కోచెస్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కోచ్ లు ఏర్పాటు అయినంత త్వరలోనే సంబంధిత రైళ్లకు కేటాయిస్తారు. రైల్వే బోర్డ్ అధికారుల ప్రకారం.. చాలా కోచ్ లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)నే తయారుచేస్తుంది.

మినిష్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రయాణికులకు ఏసీ సర్వీసులు తక్కువ ధరలోనే అందించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రైల్వేస్ ఎకానమీ ఏసీ-3 టైర్ కోచెస్ కోసం ప్లాన్ చేసింది. నార్మల్ ఏసీ 3టైర్ కోచెస్ మాదిరిగానే ఉంటాయి. ఈ స్కీం కింద కొన్ని కోచ్ లు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి. మొత్తం ఈ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 806కోచ్ లను టార్గెట్ గా పెట్టుకుంది.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) -344కోచ్ లను తయారుచేస్తుండగా, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) – 177, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ (MCF) – 285 లు తయారవుతున్నాయి. బోర్డు నుంచి అనుమతి రాగానే మార్చి 2021లోగా ట్రైన్లకు వీటిని అమర్చుతారు.