Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు

Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి

Ashwini

Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికీ భారతీయ రైల్వేలో మరో 75 వందే భారత్ రైళ్లను అందుబటులోకి తేనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చెన్నైలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని(ICF) సందర్శించారు. శుక్రవారం ఉదయం లింకే హాఫ్‌మన్ బుష్ 12,000వ కోచ్‌ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అనంతరం ఐసీఎఫ్ లోని వందే భారత్ రైళ్ల కోసం కోచ్‌ల తయారీని పరిశీలించారు. ఈసందర్భంగా వార్తా సంస్థ ఏఎన్ఐతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే అధునాతన, సౌకర్యం వంతమైన సదుపాయాలు కొత్త రైళ్లలో ఉంటాయని మంత్రి వివరించారు.

Other Stories:Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లల్లో చైర్ కార్ మాత్రమే అందుబాటులో ఉండగా.. కొత్త రైళ్లల్లో స్లీపర్ కోచ్, బెర్త్ ఉండనున్నాయి. దూరపు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ మార్పులు తెచ్చారు. అదే సమయంలో వందే భారత్ కొత్త రైల్లో ఏసీ1, ఏసీ2, ఏసీ3 పూర్తి ఏసీ కోచ్ లు ఉండనున్నాయి. వెర్షన్ 3గా పిలిచే ఈ వందే భారత్ రైళ్లు తేలికైనవి, మరింత శక్తి-సమర్థవంతమైనవి. గత రైళ్ల కంటే మరింత ఆధునిక సౌకర్యాలు కలిగి ప్రయాణీకులకు మంచి అనుభూతి అందిస్తాయని మంత్రి తెలిపారు.

Other Stories:Ethanol Fuel: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాల ఇంజిన్స్ దెబ్బతింటాయా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 102 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాదాపు అన్ని రైళ్లు చైర్ కార్ తో నడిచేవే ఉన్నాయి. సరాసరి 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు ఒక్కో కోచ్ తయారీకి రూ.120 కోట్లు ఖర్చు అవుతుంది. దేశంలో అదనంగా మరో 400 వందే భారత్ రైళ్ల కోసం 2022-23 కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరిగాయి. ప్రస్తుతం కపుర్తలా, చెన్నై మరియు రాయ్ బరేలీలోని కోచ్ ఫ్యాక్టరీలలో ఈ వందే భారత్ కోచ్ ల తయారీ కొనసాగుతుండగా..త్వరలో లాతూర్ లోని కోచ్ ఫ్యాక్టరీలోనూ తయారీ ప్రారంభించనున్నారు.