భారత తీర ప్రాంతాల్లోని ఓడల్లో ఆ ప్లాస్టిక్‌ నిషేధం

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 07:24 AM IST
భారత తీర ప్రాంతాల్లోని ఓడల్లో ఆ ప్లాస్టిక్‌ నిషేధం

జనవరి 1 నుంచి ఐస్‌క్రీమ్ కంటైనర్లు, ఆలు చిప్స్ కవర్లు, ప్లాస్టిక్ పాల బాటిళ్లు, షాంపు బాటిళ్లు, 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్‌ బాటిళ్లతో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ నిర్ణయించింది. 

ఓడల్లో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని ఇది కేవలం మనదేశానికి చెందిన ఓడలకు మాత్రమే కాదు.. ఇతర దేశ ఓడలు మనదేశాల్లో తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. భారత్‌లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను నిర్మూలించడానికి నిర్ణయాన్ని తీసుకోండి అంటూ ఆగస్టు 15న ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు షిప్పింగ్‌ అధికారులు పేర్కొన్నారు.  

అంతేకాదు ప్లాస్టిక్ కత్తులు, ప్లేట్లు, కప్పులు, ఫాపింగ్ బ్యాగులును కూడా నిషేధిచాలని డైరక్టర్ తెలిపారు. ఎందుకంటే సముద్ర జలాల్లో వీటి వల్ల నష్టం ఎక్కువగా కలుగుతోందని తేలింది. అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఎవరైనా పదేపదే వాటిని ఉపయోగిస్తే.. అది నేరం కింద కేసు అవుతోందని తెలిపారు.